కోలీవుడ్ లో విజయ్ సేతుపతికి టాలెంటేట్ నటుడని ఎలాంటి గుర్తింపు ఉందొ అలాగే ఐశ్వర్య రాజేష్ కి కూడా మంచి క్రేజ్ ఉంది. డిఫరెంట్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ  కౌసల్య కృష్ణమూర్తి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

అయితే ఈ బేబీ శంకర్ - కమల్ హాసన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఇండియన్ సీక్వెల్ లో ఒక కీలక పాత్ర చేయడానికి ఒప్పుకున్నా విషయం తెలిసిందే. గత కొంత కాలంగా ఆమె సినిమాను నుంచి తప్పుకునే ఆలోచనలో ఉన్నట్లు రూమర్స్ వచ్చాయి. ఫైనల్ గా ఆ రూమర్సే ఇప్పుడు నిజమని తేలిపోయింది. 

ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఐశ్వర్య క్లారిటీ ఇచ్చేసింది. సినిమా ఊహించని విధంగా మధ్యలో ఆగిపోతుండడంతో డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోతున్నానని ప్రస్తుతం రెస్ట్ లేకుండా బిజీ షెడ్యూల్ లో ఉన్నట్లు చెబుతూ సినిమాకు ఎప్పుడు పడితే అప్పుడు డేట్స్ సమకూర్చలేనని కుండబద్దలు కొట్టేసింది. ఫైనల్ గా ఇండియన్ 2 నుంచి తప్పుకున్నట్లు ఐశ్వర్య వివరణ ఇచ్చింది.