కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. రీఎంట్రీలో ఇప్పుడు తన సత్తా చాటాలనుకుంటోంది. తాజాగా మణిరత్నం దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి అంగీకరించినట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఇక్కడ మరో ఆసక్తికర విషయమేమిటంటే.. సినిమాలో ఐశ్వర్యారాయ్ నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపిస్తుందట. మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ 'పొన్నియన్ సెల్వన్' కథను తెరకెక్కించబోతున్నాడు. 10వ శతాబ్దానికి చెందిన కథతో ఈ సినిమాను రూపొందించనున్నారు.

ఈ సినిమాలో రాజ్యాధికారం కోసం కుట్రలు చేసే నందిని అనే పాత్రలో ఐష్ కనిపించనున్నారట. మణిరత్నం తెరకెక్కించిన పలు చిత్రాల్లో ఐశ్వర్యారాయ్ నటించింది. ఆయన చిత్రాల ద్వారానే ఆమెకి మంచి బ్రేక్ వచ్చింది.  అందుకే ఆయన ఎప్పుడు కోరినా సినిమాలో నటించడానికి సిద్ధంగా ఉంటుంది.

ఆ కారణంగానే విలన్ క్యారెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. మరి ఈ అందాల తారని అభిమానులు విలన్ గా చూడగలరో లేదో చూడాలి. ఇది ఇలా ఉండగా.. ఈ సినిమాను నిర్మించడానికి ముందుకొచ్చి లైకా ప్రొడక్షన్స్ వారు ఇంత భారీ బడ్జెట్ తమ వల్ల కాదని వదిలేసినట్లుగా ప్రచారం జరుగుతోంది.