ఉయ్యాల వాడ నరసింహారెడ్డి చిత్రంలో హీరోయిన్ గా ఐశ్వర్య రాయ్ ని ప్రిఫర్ చేస్తున్న టీమ్ మార్కెట్ ప్రపంచవ్యాప్తంగా బాగుంటుందని అంచనా భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుండటంతో ఆలోచనలో పడ్డ ఉయ్యాలవాడ టీమ్
పదేళ్ల విరామం తర్వాత మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన ఖైదీ నెంబర్ 150 సూపర్ సక్సెస్ సాధించడంతో తదుపరి చిత్రంపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. మెగాస్టార్ 151వ చిత్రం కూడా అంతకు మించి తెరకెక్కించచాలనే ఉద్దేశంతోనే కొణిదెల ప్రొడక్షన్స్ బేనర్ పై రామ్ చరణ్ స్వయంగా చిరు 151 చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన ఐశ్వర్య రాయ్ అయితే పర్ ఫెక్ట్ గా ఉంటుందని మెగాస్టార్ సహా టీమ్ అంతా భావించారు. అయితే ఐశ్వర్యరాయ్ బచ్చన్ భారీ రెమ్యునరేషన్ డిమాండ్ అంశం మీడియాలో చర్చనీయాంశమైంది.
ఉయ్యాలవాడ నర్సింహరెడ్డి జీవిత కథను కొణిదెల బ్యానర్‌పై మెగాస్టార్ తనయుడు రాంచరణ్ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఐశ్వర్యరాయ్‌ను తీసుకోవాలని భావించారు. ఈ మేరకు సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే చిరంజీవి పక్కన నటించడానికి ఆమె ఆసక్తిని చూపించారు. కానీ రూ. 9 కోట్ల రెమ్యునరేషన్‌ను డిమాండ్ చేసినట్టు సమాచారం.
ఐశ్యర్య రెమ్యునరేషన్ భారీగా డిమాండ్ చేసినప్పటికీ ఆమెతో రెమ్యునరేషన్ తగ్గింపు విషయంలో ఇంకా సంప్రదింపులు జరుతున్నట్టు సమాచారం. ఎందుకంటే ఐశ్వర్యరాయ్ హీరోయిన్‌గా నటిస్తే బాలీవుడ్‌లోనే కాకుండా ఓవర్సీస్‌లో కూడా ఉయ్యాలవాడకు రేంజ్ పెరుగుతుందనే అంచనాను మెగా ఫ్యామిలీ వేస్తున్నది. బిజినెస్ పరంగా కూడా వర్కవుట్ అయ్యే అవకాశం ఉంటుందనే కోణంలో ఆలోచిస్తున్నారట.
ఖైదీ నంబర్ 150 చిత్రం భారీ సక్సెస్ సాధించడంతో చిరంజీవి 151వ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకే భారీ హంగులతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించేందుకు కొణిదెల బ్యానర్ ప్లాన్ చేస్తున్నది. ఈ నేపథ్యంలో ఐశ్వర్య రాయ్ రెమ్యునరేషన్ అంశం మీడియాలో నానుతుండటంతో చిత్ర యూనిట్‌కు సంబంధించిన వారు స్పందించారు. ఐశ్యర్యరాయ్ రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందనే వార్తలో వాస్తవం లేదు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. "ఐశ్వర్య రాయ్ బచ్చన్‌తో సంప్రదింపులు జరిపింది నిజమే. సినిమా కథకు సంబంధించిన స్కిప్ట్‌ను ఆమె చదివారు. ప్రస్తుతం ఐశ్వర్యరాయ్ న్యూయార్క్ ట్రిప్‌లో ఉన్నారు. ఆమె తిరిగి వచ్చిన తర్వాత చిరంజీవి ఐశ్యర్యను కలిసే అవకాశం ఉంది" అని కొణిదెల బ్యానర్ టీమ్ మెంబర్ ఒకరు వెల్లడించారు.
ఇదిలా ఉండగా, ఐశ్వర్యరాయ్‌తోపాటు ఈ చిత్రంలో చిరంజీవి పక్కన హీరోయిన్‌గా ఎంపిక చేయడానికి ప్రియాంక చోప్రా, సోనాక్షి సిన్హా పేర్లను కూడా పరిశీలిస్తున్నారనేది తాజా సమాచారం. ఒకవేళ ఐశ్వర్యరాయ్ రెమ్యునరేషన్ విషయంలో తేడా వస్తే ప్రియాంకను తీసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారట. ఎందుకంటే హాలీవుడ్‌లో ప్రస్తుతం ప్రియాంక జోరు కొనసాగుతున్నది కావున ఆమెను తీసుకొంటే సినిమాకు అంతర్జాతీయ గుర్తింపు వస్తుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.
