మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ పెళ్లైన తర్వత అప్పుడప్పుడు తప్పిస్తే కెమెరా ముందుకు రావడం చాలా తక్కువ. మామూలుగా అయితే పిల్లలను చూసుకోవడానికి స్కూల్ నుండి ఇంటికి తీసుకురావడాని పనివాలని పెట్టుకోవడం లాంటివి చేస్తుంటారు. కానీ ఐష్ అలా కాదంట. 

రీసెంట్ గా ఒక  ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలు పంచుకున్న ఐశ్వర్య.. అందరి మాదిరి తాను సాధారణ తల్లిగానే ఉంటానని చెప్పారు.

.. మార్కెట్ కు వెళ్లటం లాంటి సాధారణ పనుల్ని కూడా తాను చేస్తానని చెప్పారు. ఎందుకంటే.. తాను అలా ఉన్నప్పుడు మాత్రమే సాధారణమైనవి ఏమిటి? అన్నవి అర్థమవుతాయని ఆమె చెబుతున్నారు. 

సహజమైనవి.. సోషల్ ఎగ్జైట్ మెంట్ అంటే ఏమిటన్న విషయాన్ని తన కుమార్తెకు తెలియటం కోసం తన వృత్తి జీవితాన్ని ఐష్ కాస్త త్యాగం చేసినట్లుగా చెప్పాలి. తాను 20 ఏళ్ల వయసులో మీడియాను ఎదుర్కోవటం మొదలు పెడితే.. ఆరాధ్య పుట్టినప్పటి నుంచి ఎదుర్కొంటొందని చెప్పారు. ఇప్పుడామెకు అదంతా సర్వసాధారణమైందా? అన్నది తనకు తెలీదన్నారు. ఐష్ లాంటి స్టార్ నటి.. నిత్యం ఎంత బిజీ షెడ్యూల్ ఉంటుందో తెలిసిందే. అయినప్పటికీ తన కుమార్తె కోసం ఆమె కేటాయించే సమయం చూసినప్పుడు.. తప్పనిసరిగా పిల్లల కోసం ఎంతోకొంత టైంను కేటాయించాల్సిన అవసరం ఉందనిపించక మానదు. నిజానికి ఈ విషయాన్ని ఐష్ చెప్పాల్సిన అవసరం లేదు. తల్లిదండ్రులుగా అందరి బాధ్యత.