'మీ టూ' మూవ్ మెంట్ కింద సెలబ్రిటీలు తమకు ఎదురైన అనుభవాల గురించి వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ కూడా ఈ అంశంపై స్పందించింది. ప్రపంచ వ్యాప్తంగా మహిళలు తమకు ఎదురైన దారుణాల గురించి మాట్లాడుతుండటం ఆహ్వానించదగ్గ పరిణామమని చెప్పింది. ఈ వేధింపులు ప్రపంచంలో ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాలేదని తెలిపింది. వేధింపుల గురించి ధైర్యంగా మాట్లాడటం సినిమా, వాణిజ్య రంగాలకే పరిమితం కాలేదని... అన్ని రంగాలవారు దీనిపై మాట్లాడుతున్నారని చెప్పింది.