Asianet News TeluguAsianet News Telugu

అభిషేక్ బచ్చన్ - ఐశ్వర్య రాయ్ విడిపోతున్నారా..? మరోసారి వైరల్ అవుతున్న వార్తలు

అమితాబ్ ఫ్యామిలీలో మరోసారి విడాకులు కలకలం రేగింది. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ ఇద్దరు విడాకులు తీసుకోబోతున్నారని, వారి మధ్య మనస్పర్ధలు వచ్చాయంటూ రూమర్లు షికారు చేస్తున్నారు. అయితే ఇలాంటి వార్తలు రావడం ఇది రెండో సారి. 
 

Aishwarya Rai and Abhishek Bachchan Divorce News Viral JMS
Author
First Published Nov 9, 2023, 12:40 PM IST

అభిషేక్ -ఐశ్వర్య విడాకుల వార్తలు బాలీవుడ్ ను మరోసారి కుదిపేస్తున్నాయి. గంతంలో కూడా వీరి గురించి రకరకాల వార్తలు రాగా.. వాటిపై అమితాబ్ ఫ్యామిలీ నుంచి క్లారిటీ కూడా వచ్చింది. ఇక తాజాగా మరోసారి విడాకుల వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఈ విడాకులు వార్తలకు కారణం కూడా ఉంది. అదేంటంటే..? 

బాలీవుడ్ లో  స్టార్ కపుల్.. మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్నారు.  ఐశ్వర్య రాయ్‌, అభిషేక్ బచ్చన్. వీరిద్దరు దాదాపు గా 20 ఏళ్లనుంచి  ఎటువంటి గొడవలు లేకుండా ఆయిగా కాపురం చేసుకుంటున్నారు. వీరికి  ఓ పాప ఆరాధ్య కూడా ఉంది. వీరిది అన్యోన్య దాంపత్యం..ఎప్పుడు కలిసే ఉంటారు ఈ ఇద్దరు కపుల్స్..  ఏ పార్టీకి వెళ్ళినా.. సినిమా పంక్షన్లు జరిగినా.. ఏదైనా సరే ఇద్దరు తప్పకుండా రావాల్సిందే. అంతే కాదు ఒక్కరు మాత్రం కనిపించరు ఎప్పుడూ.. కాని ఈ మధ్య కాలంలో ఐశ్వర్య అండ్ అభిషేక్ బయట ఏ ఫంక్షన్ లో కలిసి కనిపించడం లేదు. అయితే అభిషేక్ కాని.. లేకుంటే ఐశ్వర్యరాయ్ కాని కనిపిస్తుంది తప్పించి ఇద్దరు కలిసి ఏ పార్టీలకు రావగంలేదు. ఐష్ మాత్రం తన కూతురు ఆరాధ్యను వెంట పెట్టుకుని అన్నటింటికి వెళ్తుంది. 

ఎక్కడికి వెళ్లినా జంటగా కనిపించే ఈ ఇద్దరు  ఈ మధ్య మాత్రం కలిసి కనిపించడం లేదు.  రీసెంట్‌గా ఐశ్వర్య మనీష్ మల్హోత్రా ఇచ్చిన దీపావళి పార్టీలో మెరిశారు. పింక్ డ్రస్ లో  అందర్నీ ఆకట్టుకున్నారు. విషయం ఏంటంటే ఈ పార్టీలో అభిషేక్ బచ్చన్, ఆరాధ్య బచ్చన్ మాత్రం కనిపించలేదు. ఐశ్వర్య సోలో ఎంట్రీకి సంబంధించిన వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిషేక్ బచ్చన్ ఈ పార్టీలో లేకపోవడంపై నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

గతంలో కూడా ఓసారి ఇలానే జరిగింది ముంబయ్ లో గ్రాండ్ గా జరిగిన  నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ లాంఛ్ ఈవెంట్‌కు కూడా ఐశ్వర్య తన కూతురు ఆరాధ్యతో మాత్రమే కలిసి వచ్చింది. ఇంత పెద్ద ఫంక్షన్ కు అభిషేక్ రాకుండా.. ఐష్ మాత్రమే రావడంతో..అప్పట్లో వీరిద్దరు విడాకులు తీసుకుంటున్నారంటూ..  వార్తలు గుప్పుమన్నాయి. బాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్న రూమర్స్ కు  ఈ సీన్ తో  మరింత బలం చేకూరింది. దాంతో సోషల్ మీడియాలో వరుసగా స్పందించడం మొదలు పెట్టారు.  అయితే ఈ వార్తలకు చెక్ పెడుతూ.. అభిషేక్ గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చాడంటారు.కాని రీసెంట్ గా మళ్లీ సీన్ రిపిట్ అయ్యింది. 


రీసెంట్  గా ఐశ్వర్య రాయ్ తన 50 వ పుట్టినరోజు  జరుపుకోగా.. అభిషేక్ ఆ వేడుకలల్ల కనిపించలేదు. ఐశ్వర్య  సియోన్ జీఎస్‌బీ సేవా మండల్‌ల్‌లోని క్యాన్సర్ పేషెంట్ల మధ్య ఐశ్వర్య ఈ వేడుక చేసుకున్నారు. ఈ వేడుకలో కూడా ఐశ్వర్య తల్లి బృందా రాయ్, కూతురు ఆరాధ్య మాత్రమే కనిపించారు. ఈ వేడుకలకు సైతం అభిషేక్ హాజరు కాకపోవడం.. ఐశ్వర్యకు పుట్టినరోజు విషెస్ చాలా లేట్‌గా చెప్పడం .. ఇవన్నీ గమనించిన ఫ్యాన్స్ వీరిమధ్య ఏదో జరుగుతోంది అని అంటున్నారు. నిజంగా వీరు విడాకులుతీసుకోబోతున్నారా అనే అనుమానాలువ్యాక్తం చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios