ఐశ్వర్య రాయ్‌, అభిషేక్ బచ్చన్‌ ఒక పెళ్ళిలో అదిరిపోయే డాన్స్ లతో దుమ్ములేపారు. ఆరాధ్య కూడా వాళ్ళతోనే ఉంది. ముగ్గురూ మ్యాచింగ్ డ్రెస్సుల్లో కనిపించారు. వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

అభిషేక్, ఐశ్వర్య రాయ్‌ శనివారం రాత్రి ముంబైలో జరిగిన పెళ్ళికి హాజరయ్యారు. వాళ్ళతో పాటు ఆరాధ్య కూడా ఉంది. ముగ్గురూ మ్యాచింగ్ డ్రెస్సుల్లో కనిపించారు. ఐశ్వర్య డ్యాన్స్ చేస్తుంటే అభిషేక్ చప్పట్లు కొడుతూ కనిపించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో గాయకుడు రాహుల్ వైద్య కూడా ఉన్నాడు.

వైరల్ అవుతున్న వీడియో

వైరల్ వీడియోలో రాహుల్ వైద్య 'కజ్రారే' పాట పాడుతుంటే ఐశ్వర్య డ్యాన్స్ చేస్తోంది. అభిషేక్ కూడా చప్పట్లు కొడుతూ కనిపించాడు.

 

View post on Instagram
 

 

రాహుల్ వైద్య ట్రోల్

వీడియో చూసిన చాలా మంది ఐశ్వర్యా, అభిషేక్‌లను మెచ్చుకుంటుంటే, రాహుల్ వైద్యను ట్రోల్ చేస్తున్నారు. పెళ్ళిళ్లలో పాటలు పాడటం నచ్చలేదని కామెంట్లు పెడుతున్నారు.

18 ఏళ్ళ బంధం

అభిషేక్, ఐశ్వర్య రాయ్‌ విడిపోతున్నారనే వార్తలు వచ్చాయి. ఈ వీడియోతో ఆ వార్తలకు చెక్ పడింది. అభిషేక్, ఐశ్వర్య 18 ఏళ్ళ నుంచి కలిసి ఉన్నారు. 2007లో వాళ్ళ పెళ్లి జరిగింది. వీరికి కూతురు ఆరాధ్య జన్మించిన విషయం తెలిసిందే.

ఆరాధ్య ఇప్పుడు చాలా పెద్దదైంది. చూడబోతుంటే త్వరలోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఐష్‌, అభిషేక్‌ విడిపోతున్నారంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది. దానికి ఈ వీడియో ఫుల్ స్టాప్‌ పెట్టినట్టేనా అనేది ఆసక్తికరంగా మారింది.