‘లవ్ స్టోరీ’ ఏ ఓటీటిలో నంటే....


 టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో.. నాగ చైతన్య , సాయిపల్లవి జంటగా తెరకెక్కిన చిత్రం ‘లవ్ స్టోరీ’. రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ కూడా దాదాపుగా పూర్తయి..  ఏప్రిల్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌ అక్కినేని ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఎప్పటిలాగానే.. శేఖర్ కమ్ముల కుటుంబ భావోద్వేగాలు, ప్రేమ, వినోదం తదితర అంశాల ఆధారంగా ఈ సినిమాను అద్భుతంగా తెర‌కెక్కించిన‌ట్టు టీజర్‌  ను చూస్తే అర్ధ‌మ‌వుతుంది. 

Aha bags digital rights of  Chaitanya and Sai Pallavi 'Love Story' jsp

టాలీవుడ్ స్టార్ డైరక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో.. నాగ చైతన్య , సాయిపల్లవి జంటగా తెరకెక్కిన చిత్రం ‘లవ్ స్టోరీ’. రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ కూడా దాదాపుగా పూర్తయి..  ఏప్రిల్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌ అక్కినేని ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఎప్పటిలాగానే.. శేఖర్ కమ్ముల కుటుంబ భావోద్వేగాలు, ప్రేమ, వినోదం తదితర అంశాల ఆధారంగా ఈ సినిమాను అద్భుతంగా తెర‌కెక్కించిన‌ట్టు టీజర్‌  ను చూస్తే అర్ధ‌మ‌వుతుంది. 

 అలాగే ఇప్పటికే విడుదలైన ‘సారంగదరియా..’ సాంగ్ పెద్ద హిట్టైంది.  సుద్దాల ఆశోక్‌తేజ అందించి సాహిత్యానికి గాయని మంగ్లీ మ్యాజిక్‌ వాయిస్‌ తోడవడంతో మరోసారి వినాలనిపించేంత అద్బుతంగా పాట ఉంది. పవన్‌ సీహెచ్‌ అందించిన మంచి బీట్‌తో కూడిన సంగీతం పాట విన్నవాళ్లు స్టెప్పులు వేసేంత ఊపునిస్తుంది. ఈ నేపధ్యంలో ఈ సినిమాపై మంచి ఎక్సపెక్టేషన్స్  ఏర్పడ్డాయి. అలాగే ఈ సినిమాకు ఏర్పడ్డ హైప్ మేరకు ఈ సినిమా భారీ స్థాయిలో థియేట్రికల్ రైట్స్ అమ్మడు పోయినట్లు సమాచారం. 'లవ్ స్టోరీ' చిత్రానికి బిజినెస్ పరంగా మంచి ఫ్యాన్సీ ఆఫర్లు వస్తున్నాయి. ఈ చిత్రం థియేట్రికల్ హక్కులు సుమారు 30 కోట్లకు అమ్ముడుపోయిన్నట్టు తెలుస్తోంది.

అలాగే ఈ సినిమా శాటిలైట్ అండ్ ఓవర్సీస్ రైట్స్ ఓ రేంజ్‌లో అమ్ముడుపోయాయని టాక్. ఈ సినిమా చైతన్య గత సినిమాలన్నింటికంటే భారీ ధర పలికిననట్లు తెలుస్తోంది. ఓ ప్రముఖ ఛానెల్ శాటిలైట్ రైట్స్ భారీ మొత్తాన్ని ఆఫర్ చేసిందట. ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్‌ను భారీ ధరకు ఆహా దక్కించుకుందని తెలుస్తోంది. 

అమిగోస్‌ క్రియేషన్స్‌పై తెరకెక్కిన ‘లవ్‌స్టోరీ’ ఏప్రిల్‌ 16న ప్రేక్షకుల ముందుకు  రానుంది. ఈ సినిమాకు శేఖర్ కమ్ముల  దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ, అమిగోస్ క్రియేషన్స్‌పై కె నారాయణదాస్ నారంగ్, పి రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప‌వ‌న్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమాలో నాగ చైతన్య, సాయి పల్లవి  తోపాటు రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios