టాలీవుడ్ చరిత్రలో ఎన్నడూలేని విధంగా అజ్ఞాతవాసి సినిమా విషయంలో హైప్ వచ్చింది. పవన్ కల్యాణ్ స్టామినాకు అనుగుణంగా రికార్డుస్థాయిలో బిజినెస్ జరిగింది. అయితే రిలీజ్ తర్వాత బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది. అయితే ఈ చిత్రం డిస్టిబ్యూటర్లకు తీరని నష్టాన్ని కలిగించింది. రూ.150కు పైగా బిజినెస్ జరిగినట్టు వార్తలు వచ్చాయి. అయితే దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా దారుణమైన పరాజయంగా రికార్డు సృష్టించింది. ఈ సినిమాకు ఫైనల్‌గా ఎంత నష్టం వచ్చిందంటే..

అజ్ఞాతవాసి చిత్రం విడుదలకు ముందే 150 కోట్లకుపైగా బిజినెస్ చేసింది. థియేట్రికల్ రైట్స్ 120 కోట్లు తెలుగు శాటిలైట్ రైట్స్ 19 కోట్లు ఇతర భాషల శాటిలైట్ రైట్స్ 6 కోట్లు డిజిటల్ రైట్స్ 7 కోట్లు ఇతర హక్కులకు 3 కోట్లు మొత్తంగా అజ్ఞాతవాసి చిత్రం రూ.150 కోట్లకుపైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడం ఓ రికార్డు. తెలుగు రాష్ట్రాల్లో అజ్ఞాతవాసి తొలిరోజు భారీగానే కలెక్షన్లు సాధించింది. తొలిరోజు సినిమాకు ప్రతికూలంగా టాక్ రావడంతో కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. ఆంధ్రప్రదేశ్ నైజాంలో ఈ చిత్రం 40.9 కోట్లు షేర్ (63.5 కోట్ల గ్రాస్) కలెక్షన్లను సాధించింది.

అజ్ఞాతవాసి చిత్రం ఆంధ్రాలో 25.15 కోట్లు, సీడెడ్‌లో 5.30 కోట్లు, నైజాంలో 10.45 కోట్లు వసూలు చేసింది. ఏపీలో జిల్లాల వారీగా చూసుకొంటే.. వైజాగ్‌లో 5.40 కోట్లు, తూర్పు గోదావరిలో 4.25 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 4.75 కోట్లు, కృష్ణా జిల్లాలో 3.35 కోట్లు, గుంటూరులో 5.15 కోట్లు, నెల్లూరులో 2.25 కోట్లు వసూలు చేసింది.

ఇతర రాష్ట్రాల్లో కూడా అజ్ఞాతవాసికి దారుణమైన కలెక్షన్లు ఉన్నట్టు స్పష్టమవుతున్నది. కర్ణాటకలో 7.2 కోట్లు వసూలు చేయగా, దేశంలోని మిగితా రాష్ట్రాల్లో 1.15 కోట్లు వసూలు చేసింది. 

ఇక ఓవర్సీస్‌ బిజినెస్ విషయానికి వస్తే.. అమెరికాలో అజ్ఞాతవాసి చిత్రం 7.20 కోట్లు వసూలు చేసింది. అమెరికా కాకుండా మిగితా దేశాల్లో ఈ చిత్రం 1.90 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టింది.
ప్రపంచవ్యాప్తంగా అజ్ఞాతవాసి చిత్రం 150 కోట్లకుపైగా బిజినెస్ చేసింది. అయితే ఈ చిత్రానికి ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్లు 57 కోట్లు షేర్ మాత్రమే. పవన్ కల్యాణ్ సినిమా ఇంత దారుణంగా కలెక్షన్లు సాధించిన దాఖలాలు గతంలో లేవు.