అపుడే ‘అజ్ఞాతవాసి’ అమెరికాలో రికార్డు సృష్టించింది

Agnyaathavaasi creates record in US
Highlights

ఇంత వరకు ఏ భారతీయ చిత్రమూ సృష్టించని రికార్డు ఇది

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన అజ్ఞాతవాసి అమెరికాలో సునామీ సృష్టించబోతున్నదా? ఈ చిత్రం విడుదలవుతున్న తీరు చూస్తే అలాగే అనిపిస్తుంది.  గతంలో ఎన్నడూ ఏచిత్రమూ విడుదల కానన్ని స్క్రీన్ల మీద అజ్ఞాత వాసి విడుదలవుతున్నది. ఈ విషయంలో అజ్ఞాతవాసి బాహుబలి , దంగల్ లను మించిపోయింది. ఇండియాలో  జనవరి 10 న విడుదలవుతన్న ఈచిత్రం అమెరికాలో  జనవరి తొమ్మిదే విడుదలవుతున్నది. యు ఎస్ లో ఇది 570 స్క్రీన్ ల ప్రదర్శించబోతున్నారు. గతంలో విడుదలయి చిత్రాలతో పోలిస్తే ఇది చాలా చాలా చాలా  ఎక్కువ. బాహుబలి-2  440 స్ర్కీన్ల ను మించలేదు. దంగల్ 350 మాత్రమే. అమెరికాలో ఎల్ ఎ తెలుగు  ఈ చిత్రాన్ని అమెరికాలోమార్కెటింగ్ చేస్తున్నది. ఈ సంస్థ అందిస్తున్ వివరాల ప్రకారం 570 లొకేషన్స్ లో అజ్ఞాతవాసి ప్రదర్శిస్తారు. జాబితా ఇదే. అమెరికాలో  ఏ భారతీయ చిత్రం ఇంతభారీగా విడదల కాలేదు.ఇతర తెలుగు భారీ చిత్రాల జాబితాఇలా ఉంది. సుల్తాన్ (287), ట్యూబ్ లైట్ (340), ఖైదీ నెంబర్  150 (186), జై లవకుశ (180). ఇAgnyaathavaasi biggest Ever USA Release for an Indian Film in 570 Locations అని చెప్పుకుంటున్నారు. అడ్వాన్స్ బుకింగ్ కూడా డిసెంబర్ 16నే మొదలయింది. 

 

ఇది కూడా చదవండి

  • టాలివుడ్ హాటాట్ టూకీలు

  • https://goo.gl/ZVo3tx

     

loader