అవును...ఖచ్చితంగా ఇది పవన్ కళ్యాణ్ అభిమానులను అలరించే వార్తే. లేకపోతే తెలుగులో డిజాస్టర్ ఫలితం తెచ్చుకున్న చిత్రం ...ఇప్పుడు అంటే రిలీజ్ అయిన ఇంతకాలానికి కొత్త రికార్డ్ క్రియేట్ చేయటమేంటి. 

వివరాల్లోకి వెళితే... పవన్ కల్యాణ్‌ నటించిన ‘అజ్ఞాతవాసి’ సినిమా కొత్త రికార్డు సృష్టించింది. ఈ చిత్రం హిందీ డబ్బింగ్‌ వెర్షెన్‌ను అక్టోబరు 20న యూట్యూబ్‌లో విడుదల చేస్తే ఊహకు అందని రెస్పాన్స్ వచ్చింది. కేవలం 24 గంటల్లోనే సినిమాను 9.4 కోట్ల మంది చూసారు. అలా చూస్తూనే ఉన్నారు. 

హిందీలో డబ్‌ చేసి.. యూట్యూబ్‌లో విడుదల చేసిన సౌత్ ఇండియన్ సినిమాల్లో  అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ   వ్యూస్ సాధించిన చిత్రంగా ‘అజ్ఞాతవాసి’రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాను హిందీలో ‘ఎవడు 3’ టైటిల్‌తో విడుదల చేశారు.

త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో రూపొందిన ‘అజ్ఞాతవాసి’లో పవన్ హీరో కాగా కీర్తి సురేశ్‌, అను ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్స్. ఖుష్బూ, ఆది పినిశెట్టి, బొమన్‌ ఇరానీ, రావు రమేశ్‌, మురళీ శర్మ, వెన్నెల కిశోర్‌, తనికెళ్ల భరణి తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌. రాధాకృష్ణ నిర్మించారు. అనిరుధ్‌ బాణీలు అందించారు. ఈ ఏడాది జనవరిలో విడుదలైన ఈ సినిమా కాపీ వివాదంలో చిక్కుకుంది. 

ఈ సినిమా ద్వారా తెలుగులోకి మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ఎంట్రీ ఇచ్చిన అనిరుధ్ త‌న‌దైన స్టైల్లో మంచి మ్యూజిక్ ని అందించాడు. మూడు పాట‌లు బావున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్   బావుంది. ముఖ్యంగా ప‌వ‌న్ పాడిన కొడ‌కా కోటేశ్వ‌ర‌రావా పాట ఆక‌ట్టుకుంటుంది. మ‌ణికంద‌న్ ప్ర‌తి సీన్ ని విజువల్ ట్రీట్ గా మలిచేందుకు ప్రయత్నించారు.   అయితే బలహీన కథ,కథనాలే తెలుగులో దెబ్బ కొట్టాయి.