మెగాస్టార్ చిరంజీవి 'చంటబ్బాయి', మోహన్ బాబు 'డిటెక్టివ్ నారద' వంటి సినిమాలు సీరియస్ గా కాకుండా హాస్యంతో నడిపించి తెలుగు తెరకు ఓ కొత్త జోనర్ ని పరిచయం చేశారు జంధ్యాల, వంశీ వంటి సీనియర్ దర్శకులు. మళ్లీ ఇంత కాలానికి అదే కాన్సెప్ట్ సినిమాను రూపొందిస్తున్నాడు కొత్త దర్శకుడు స్వరూప్ ఆర్ ఎస్ జె.

అదే 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ'. నవీన్ పోలిశెట్టి, శ్రుతి వర్మలను జంటగా పరిచయం చేస్తూ రూపొందిస్తోన్న ఈ సినిమాను రాహుల్ దేవ్ నక్కా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ ని విడుదల చేశారు.

టీజర్ మొత్తం కామెడీతో నింపేశారు. మొదటి సినిమా అయినప్పటికీ హీరో నవీన్ పరిణితి ఉన్న నటుడిగా నటించడం విశేషం. 'మా అబ్బాయిని వెతికి పట్టుకోవడానికి మంచి డిటెక్టివ్ ని మీరే చూసి పెట్టండి' అంటూ డిటెక్టివ్ అయిన హీరోని అడగడం అతడి పాత్ర ఎలా ఉండబోతుందో చెబుతోంది. మార్క్ కె రాబిన్ మ్యూజిక్ టీజర్ కి హైలైట్ గా నిలిచింది. కాన్సెప్ట్ గనుక క్లిక్ అయితే ఈ సినిమా హిట్ కొట్టడం ఖాయమనిపిస్తుంది!