అయ్యగారూ ఈ అవతారం ఏమిటి...ఆందోళనలో ఫ్యాన్స్
ఆ వీడియో చూసిన వాళ్లు దాన్ని నాశిరకంగా ఉందని విమర్శలు చేస్తున్నారు. టీజర్ లో అఖిల్ లుక్ దారుణంగా ఉందని, పూర్తి రక్తంతో నింపిన లుక్ తో అసలు ఆకట్టుకోలేదని చెప్తన్నారు.

ఏ సినిమాకైనా ప్రమోషన్ కంటెంట్ అనేది అతి ముఖ్యమైన అంశం. టీజర్,ట్రైలర్, ఫస్ట్ లుక్ పోస్టర్ వీటిని బట్టే ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతోంది. ఓపినింగ్స్ వస్తున్నాయి. ఎంత పెద్ద హీరోకు అయినా అది తప్పటం లేదు. అందుకే డైరక్టర్స్ ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాజా చిత్రాలను గమనిస్తే అది అర్దమవుతుంది. అయితే అఖిల్ తాజా చిత్రానికి ఎక్సపెక్టేషన్స్ తగ్గ స్దాయిలో ప్రమోషన్స్ లేవనేది అభిమానుల వాదన. ‘ఏజెంట్’ విడుదల తేదీని ఓ ప్రోమో ద్వారా వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 28న విడుదల చేయనున్నట్టు పేర్కొన్నారు.
అక్కినేని అఖిల్ (Akkineni Akhil) హీరోగా చేస్తున్న తాజా సినిమా ‘ఏజెంట్’ (Agent).స్టైలిష్ డైరక్టర్ సురేందర్ రెడ్డి (Surender Reddy) దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌గా పాన్ ఇండియాగా తెరకెక్కింది. అనేక భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. సంక్రాంతి కానుకగా మూవీని రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. కానీ, పండగ సందర్భంగా అనేక చిత్రాలు విడుదల అవుటంతో రిలీజ్ కాలేదు. నిజానికి ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ కాకపోవడంతో వాయిదా పడుతూ వచ్చింది. ఫైనల్‌గా ఏప్రిల్ 28 సమ్మర్ కానుకగా రిలీజ్ చేయనున్నట్టు ఓ వీడియోతో ప్రకటించారు. అయితే ఆ వీడియో చూసిన వాళ్లు దాన్ని నాశిరకంగా ఉందని విమర్శలు చేస్తున్నారు. టీజర్ లో అఖిల్ లుక్ దారుణంగా ఉందని, పూర్తి రక్తంతో నింపిన లుక్ తో అసలు ఆకట్టుకోలేదని చెప్తన్నారు. మరికొంతమంది రీసెంట్ గా షారూఖ్ ఖాన్, అట్లీ చిత్రం ఫస్ట్ లుక్ టీజర్ ని గుర్తు చేసిందంటున్నారు. ఏదైమైనా అనుకున్న స్దాయిలో ఈ టీజర్ బజ్ క్రియేట్ చేయలేదనేది నిజం.
ఇక ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్టు చెప్పారు. ఈ చిత్రంలో సాక్షి వైద్య (Sakshi Vaidya) హీరోయిన్‌గా నటించారు. మమ్ముట్టి (Mammootty) ఓ కీలక పాత్రను పోషించారు. సాక్షి వైద్య ఈ మూవీతోనే టాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వనున్నారు. హీరోయిన్‌గా కూడా ఆమెకు ఇదే మొదటి చిత్రం.ఇక ఏజెంట్ టీం నెక్ట్స్ షెడ్యూల్ కోసం ఈ నెల 15న మస్కట్‌కు బయలుదేరనుంది. 15 రోజులపాటు సాగే ఈ షెడ్యూల్‌లో యాక్షన్ పార్టును చిత్రీకరించనున్నారట. మరిన్ని వివరాలపై త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్. వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథనందిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి.
అఖిల్ అక్కినేని కెరీర్ విషయానికి వస్తే.. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ (Most Eligible Bachelor) లో చివరగా కనిపించారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించారు. బొమ్మరిల్లు బాస్కర్ తెరకెక్కించారు. జీఏ2 పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం అఖిల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో ‘ఏజెంట్’ ను పట్టాలెక్కించారు.