అక్కినేని అభిమానులు ఎదురుచూస్తున్న అఖిల్ ‘ఏజెంట్’ టీజర్ తాజాగా రిలీజ్ అయ్యింది. యాక్షన్ రైడ్ తో అఖిల్ అదరగొట్టాడు. టీజర్ కట్ సినిమాపై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేసేలా అద్భుతంగా ఉంది. 

మరో సాలిడ్ హిట్ ను తన ఖాతాలో వేసుకునేందుకు అక్కినేని యంగ్ హీరో అఖిల్ (Akhil Akkineni) సిద్ధమవుతున్నారు. తన నటించిన యాక్షన్ ఫిల్మ్ ‘ఏజెంట్’తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం రిలీజ్ కు సిద్ధమవడంతో మేకర్స్ అదిరిపోయే అప్డేట్స్ ను అందిస్తూ సినిమాపై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీని విడులైన టీజర్ (Agent Teaser) యూట్యూబ్ లో దూసుకుపోతోంది. అఖిల్ సరికొత్తగా, బెస్ట్ పెర్పామెన్స్ కు ఈ టీజర్ ప్రామీసింగ్ గా కనిపిస్తోంది. 

టీజర్ కట్ ఆడియెన్స్ ను ఆకట్టుకునేలా ఉంది. మలయాళ స్టార్ మమ్మూట్టీ (Mamootty) రా ఏజెంట్ గా ‘మహదేవ్’ పాత్రలో మమ్మూట్టీ నటిస్తున్నారు. అఖిల్ మాస్ యాక్షన్ అద్భుతంగా ఉంది. దేశభక్తికి సంబంధించిన కథాంశంగా తెలుస్తోంది. అఖిల్, మమ్మూట్టీకి మధ్య సాగే కథనే సినిమాను ప్రధానంశంగా ఉండనుందని అర్థమవుతోంది. టీజర్ చివర్లలో అఖిల్ సిక్స్ ప్యాక్ చూపించే బ్లాక్ అదిరిపోయింది. స్పైగా అఖిల్ ఎలా అలరించబోతున్నాడోనని సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ హిప్ హప్ తమిజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఇచ్చాడు.

అఖిల్, దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబినేషనల్ వస్తున్న ఈ చిత్రం కోసం ఇప్పటికే ఆడియెన్స్, అక్కినేని అభిమానులు తెగ ఎదురుచూస్తున్నారు. గతంలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’తో మంచి హిట్ ను అందుకున్న అఖిల్.. ఈ సినిమాతో మరో సాలిడ్ హిట్ ను అందుకోవడం పక్కా అనిపిస్తోంది ‘ఏజెంట్’ టీజర్. రిలీజ్ అయిన గంటలోనే లక్షల్లో వ్యూస్ ను సొంతం చేసుకోవడం గమనార్హం. అయితే ఈ టీజర్ అన్ని భాషల్లో విడుదలైంది. తమిళంలో హీరో శివకార్తీకేయ, కన్నడలో కిచ్చా సుదీప్ టీజర్ ను విడుదల చేశారు. ఇందుకు మేకర్స్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 12న రిలీజ్ కానుంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రచారం కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అఖిల్ కు జోడిగా హీరోయిన్ గా సాక్షి వైద్య (Sakshi Vaidya) ఆడిపాడింది. ఏకే ఎంట‌ర్టైన‌మెంట్స్ బ్యాన‌ర్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి సురేంద‌ర్ రెడ్డి కూడా నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. పాన్ ఇండియన్ సినిమాగా ‘ఏజెంట్’ను గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.

Scroll to load tweet…