ఏజెంట్ సినిమాలో హీరోయిన్ గా చేసింది #Sakshi Vaidya సాక్షి వైద్య. ఆమెకు ఇప్పుడు మెగా క్యాంప్ లో వరస ఆఫర్స్ వచ్చాయని వినికిడి.
సినిమా వాళ్లకు సెంటిమెంట్స్ ఎక్కువ. హిట్ సినిమాలో పని చేసిన వాళ్ళకు అందుకే కంటిన్యూగా ఆఫర్స్ వస్తూంటాయి. అలాగే సినిమా పోయిందంటే ఆ టీమ్ ని దగ్గరకు కూడా రానివ్వరు. అయితే సాక్షి వైద్య పరస్దితి రివర్స్ లో నడుస్తోంది. ఇంతకీ ఎవరామె అంటారా..
అఖిల్ అక్కినేని హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ఏజెంట్(Agent).రిలీజ్ అయ్యి ఇన్ని రోజులు అయినా ఇంకా ఏదో విధంగా ప్రతీ రోజు వార్తల్లో నిలుస్తోంది. స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి(Surendar reddy) తెరకెక్కించిన ఈ మూవీ.. ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకి వచ్చింది. పాన్ ఇండియా రేంజ్ లో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ మార్నింగ్ షోకే డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది. దీంతో మినిమమ్ ఓపెనింగ్స్ ని కూడా దక్కించుకోలేకపోయింది ఈ మూవీ. ఈ సినిమాలో హీరోయిన్ గా చేసింది #Sakshi Vaidya సాక్షి వైద్య. ఆమెకు ఇప్పుడు మెగా క్యాంప్ లో వరస ఆఫర్స్ వచ్చాయని వినికిడి.
ప్రస్తుతం వరుణ్ తేజ్ హీరోగా చేస్తున్న గాండీవ ధారి అర్జున #GandeevadhariArjuna లోనూ, సాయి ధరమ్ తేజ తదుపరి చిత్రంలోనూ చేస్తోంది. అలాగే పవన్ కళ్యాణ్ #UstaadBhagatSinghలో సెకండ్ లీడ్ కు ఎంపికైందని సమాచారం. ఇలా మెగా క్యాంప్ లో ఇంత బిజి అవుతుందని ఎవరూ ఊహించి ఉండరు.
ఇక సాక్షి వైద్య పూణేలో పుట్టి పెరిగింది. ఫిజియోథరపిస్ట్ కోర్సు చదువుకొని ప్రాక్టీస్ కూడా చేసింది. కరోనా సమయంలో ఖాళీగా ఉండటంతో వీడియోలు, రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో బిజీ అయిపోయింది. ఆ క్రమంలో కొన్ని ఆడిషన్స్‌కు వెళ్లడం మొదలుపెట్టింది. ముంబైలో చాలా ఆడిషన్స్‌కు వెళ్లింది. చాలా మంది నన్ను రిజెక్ట్ చేశారు. అయితే ఒక రోజు హైదరాబాద్‌లోని ప్రొడక్షన్ హౌస్ నుంచి కాల్ వచ్చింది. అయితే ఆమె నమ్మలేదు. కానీ ముంబైలో కాస్టింగ్ మేనేజర్ ఆమెకు కాల్ చేసి... మీకు వచ్చిన కాల్ జెన్యూన్ చెప్పారు. బిగ్ ప్రొడక్షన్ హౌస్, బిగ్ డైరెక్టర్ అని చెప్పాడు. దాంతో ఆమె వారిని కలిశాను. సురేందర్ రెడ్డి ఆడిషన్ చేయించి ఓకే చేశారు. దాంతో ఏజెంట్ ఈ ఆఫర్ వచ్చింది.
