అగస్త్యా నందన్ ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్.. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మనవడు. ఇంకా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వలేదు.. కానీ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాడు. అగస్త్యా రీసెంట్ గా ఇన్ స్టాలో ఎంట్రీ ఇచ్చాడు.

ఇలా ఎంట్రీ ఇచ్చాడో లేదో అలా అగస్త్యాకు 48వేలమంది ఫాలోవర్స్ వచ్చేశారు. వీరిలో తాతయ్య అమితాబ్ తో పాటు బాలీవుడ్ టాప్ సెలబ్రిటీలంతా ఉన్నారు. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ కూడా వీరిలో ఒకరు.

అయితే అగస్త్య నందా ఫోస్ట్‌ చేసిన ఓ ఫొటోకు సుహానా ఖాన్‌ అన్‌ ఫాలోయింగ్‌ అని మెసేజ్‌ పెట్టింది. ఇది ఇప్పుడు టాక్‌ఆప్‌ది టౌన్‌ అయ్యింది. ఓపెన్ రెస్టారెంట్లో సంధ్యాసమయంలో దిగినట్టుగా ఉన్న ఓ ఫొటోకు సుహానా అన్ ఫాలో అని పెట్టింది. అయితే ఈ ఫొటోను అలియా భట్ కూడా లైక్ చేసింది. 

అగస్త్యా, సుహనా ఇద్దరూ చిన్నప్పట్నుంచి మంచి స్నేహితులు. అయితే సుహానా ఎందుకు అగస్త్యా నందాను అన్‌ఫాలో అయ్యిందోనని బాలీవుడ్‌ వర్గాలు చర్చించుకుంటున్నాయి.