రామ్ ఒక ఆఫీసర్ ని పిస్తోలుతో కాల్చేస్తాడు. కానీ విచిత్రంగా అదే ఆఫీసర్ మళ్ళీ ఆ ముఖ్యమంత్రి వెనకాల కనపడతాడు.


ఇది డిజిటల్ యుగం..సోషల్ మీడియా వచ్చాక ప్రతీ విషయం మంచి, చెడు రెండు చర్చగా మారుతున్నాయి. ట్రోలింగ్ అనేది ఇక్కడ కామన్ థింగ్ అయ్యిపోయింది. ఇక అసలు విషయానికి బోయపాటి రీసెంట్ చిత్రం స్కంథ రిలీజ్ అయ్యాక చాలా మంది వినయ విధేయరామ చిత్రంతో పోల్చి ట్రోల్ చేసారు. సినిమా ప్లాఫ్ అవటం కూడా అందుకు కలిసి వచ్చినట్లైంది. సర్లై అవన్ని మామూలే అనుకుంటే ఇప్పుడు మరోసారి ట్రోలింగ్ మొదలైంది. అందుకు కారణం రీసెంట్ గా ఓటిటిలో రిలీజ్ అవటమే. వివరాల్లోకి వెళితే..

మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ పోతినేని (Ram Pothineni)తో తెరకెక్కించిన చిత్రం స్కంద (Skanda). సెప్టెంబర్‌ 28న తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్నడ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం ప్లాఫ్ టాక్‌ తెచ్చుకుంది. సిల్వర్ స్క్రీన్‌పై బోయపాటి-రామ్‌ మేనియాను మిస్సయినవాళ్ల కోసం డిజిటల్‌ ప్లాట్‌ఫాంలో సందడి చేస్తోంది. ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుండగా.. రామ్‌ మేనియా కొనసాగుతుంది అనుకుంటే బోయపాటికి ట్రోలింగ్ మొదలైంది.

Scroll to load tweet…

‘స్కంద’లో కథతో పాటు అనేక అంశాలు ఇల్లాజికల్‌గా, అర్థ రహితంగా అనిపించడంతో థియేట్రికల్ రిలీజ్ టైంలో ట్రోలింగ్ సాగింది. ఇప్పుడు మరోసారి ఓటిటిలో చూసిన జనం...బోయపాటిని నెటిజన్లు ఒక రేంజిలో ఆడుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. పాపం బోయపాటి సోషల్ మీడియాకు టార్గెట్ అయ్యాడు. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో ఒక చిన్న తప్పు దొర్లింది, దాని మీద ట్రోలింగ్ చేస్తున్నారు. ఇంతకీ ఆ తప్పు ఏంటంటే, రామ్ పోతినేని సినిమాలో తెలంగాణ ముఖ్యమంత్రి ఇంటికి వచ్చాక ఒక పెద్ద పోరాటసన్నివేశంలో పాల్గొంటాడు.

ఆ సన్నివేశంలో రామ్ ఒక ఆఫీసర్ ని పిస్తోలుతో కాల్చేస్తాడు. కానీ విచిత్రంగా అదే ఆఫీసర్ మళ్ళీ ఆ ముఖ్యమంత్రి వెనకాల కనపడతాడు. అంటే ఎడిటింగ్ లో చూసుకోకపోవటం వలన ఇదొక పెద్ద తప్పుగా దొర్లింది. ఇక నెటిజన్స్ వెంటనే ఈ తప్పుని పట్టుకొని ట్రోలింగ్ చెయ్యడం మొదలెట్టేసాడు.

ఈ మూవీ లో నీ చుట్టూ చుట్టూ, గండరబాయ్, డుమ్మారే డుమ్మారే పాటలతోపాటు, టీజర్‌, ట్రైలర్‌ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యాయి. సిల్వర్ స్క్రీన్‌పై రామ్-శ్రీలీల ఇరగదీసే డ్యాన్స్‌తో అదరగొట్టేశారు. ఓపెనింగ్‌ ఎండింగ్‌ ఇచ్చేసి.. స్కంద సీక్వెల్‌ కూడా ఉంటుందని ప్రకటించాడు బోయపాటి. మరి ఇప్పుడు సీక్వెల్ తీస్తారా లేదా అన్నది వేచి చూడాల్సిన అంశం.