యంగ్  టైగర్ ఎన్టీఆర్ కి కరోనా సోకిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా స్వయంగా తెలియజేశారు. ఎన్టీఆర్ అభిమానులను ఈ వార్త తీవ్ర ఆందోళనలు గురిచేసింది. ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ విషెష్ తెలియజేశారు. అలాగే తమ ఇష్టదైవాలకు ప్రార్ధనలు చేశారు. కరోనా సోకిన వెంటనే క్వారంటైన్ అయిన ఎన్టీఆర్ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకున్నారు. 


దాదాపు రెండు వారాల చికిత్స తరువాత ఎన్టీఆర్ కోలుకున్నారు. తనకు కరోనా నెగిటివ్ గా నిర్ధారణ అయినట్లు ఫ్యాన్స్ కి తెలియజేశారు. ఆ న్యూస్ ఫ్యాన్స్ ని ఆనందంలో ముంచి వేసింది. కరోనా నుండి కోలుకున్న ఎన్టీఆర్ మొదటిసారి కెమెరా కంటికి చిక్కారు.  దేవాలయానికి వెళ్లిన ఎన్టీఆర్ అక్కడున్న అర్చకుడితో ఫోటో దిగారు. ట్రెడిషనల్ వేర్ లో ఉన్న ఎన్టీఆర్ లుక్ ఆసక్తికరంగా ఉంది. 

మరో వైపు ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ పూర్తి చేయాల్సి ఉంది. కరోనా విజృంభణ నేపథ్యంలో అన్ని చిత్రాల షూటింగ్స్ తో పాటు ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కి బ్రేక్ పడింది. విడుదల తేదీ దగ్గరపడుతుండగా చిత్ర యూనిట్ ఆందోళన చెందుతున్నారు.

ఇక ఆర్ ఆర్ ఆర్ తరువాత ఎన్టీఆర్ దర్శకుడు కొరటాల శివ మూవీలో నటించనున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది. కాగా ఎన్టీఆర్ తన 31వ చిత్రం దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ప్రకటించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.