Asianet News TeluguAsianet News Telugu

రవితేజ ఇచ్చిన షాక్ మరవక ముందే... బాలయ్యకు చిరు షాక్?

మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి లూసిఫర్ తెలుగు రీమేక్ చేయనున్న విషయం తెలిసిందే. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ మూవీకి టైటిల్ గా గాడ్ ఫాదర్ అనుకుంటున్నారట. మరి ఇదే జరిగితే బాలయ్య కోరుకున్న గాడ్ ఫాదర్ టైటిల్ కూడా పోయినట్లే.

after raviteja chiranjeevi ready to steel balakrishna desired title ksr
Author
Hyderabad, First Published Jul 30, 2021, 3:55 PM IST

ఇటీవల రవితేజ బాలయ్యకు భారీ షాక్ ఇచ్చాడు. రామారావు అనే టైటిల్ ప్రకటించి బాలయ్య ఆశలపై నీళ్లు చల్లారు. బాలకృష్ణ తో అనిల్ రావిపూడి ఓ మూవీ చేయనున్నట్లు గతంలోనే ప్రకటించారు. స్టార్ డైరెక్టర్ లిస్ట్ లో చేరి వరుస హిట్స్ కొడుతున్న అనిల్ రావిపూడితో మూవీ చేయడానికి బాలయ్య కూడా సిద్ధంగా ఉన్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో చిత్రానికి 'రామారావు గారు' అనే టైటిల్ పెట్టాలని భావించారు. 


కానీ ఆ టైటిల్ కి చాలా దగ్గరగా ఉన్న రామారావు ఆన్ డ్యూటీ అనే టైటిల్ తన లేటెస్ట్ మూవీకి పెట్టుకొని రవితేజ, బాలయ్య ఫ్యాన్స్ ని కూడా నిరాశపరిచాడు. అది అలా ఉంటే... రవితేజ మాదిరి, చిరంజీవి కూడా బాలయ్యకు మరో షాక్ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతుంది. బాలకృష్ణ -బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న అఖండ చిత్రానికి మొదట టైటిల్ గా గాడ్ ఫాదర్ అనుకున్నారు. టైటిల్ చాలా పవర్ ఫుల్ గా ఉన్నప్పటికీ కథకు సరిపడదన్న ఆలోచనతో, ఆ టైటిల్ కి బదులు అఖండ టైటిల్ ని నిర్ణయించడం జరిగింది. 


అయితే మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి లూసిఫర్ తెలుగు రీమేక్ చేయనున్న విషయం తెలిసిందే. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ మూవీకి టైటిల్ గా గాడ్ ఫాదర్ అనుకుంటున్నారట. మరి ఇదే జరిగితే బాలయ్య కోరుకున్న గాడ్ ఫాదర్ టైటిల్ కూడా పోయినట్లే. దీనిపై స్పష్టత రావాలంటే మరి కొంత కాలం ఎదురు చూడాల్సిందే. ప్రస్తుతం ఆచార్య షూటింగ్ లో చిరు, అఖండ షూటింగ్ లో బాలయ్య బిజీగా ఉన్నారు. ఈ రెండు చిత్రాల షూటింగ్స్ చివరి దశలో ఉన్నాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios