Asianet News TeluguAsianet News Telugu

‘లక్ష్మీ బాంబ్’ డిజాస్టర్..సినీ ఇండస్ట్రీకు అమేజాన్ భారీ షాక్


బాలీవుడ్ మీడియా నుంచి అందుతున్న సమాచారం మేరకు.. ఇన్నాళ్లూ హీరోలు, డైరక్టర్స్ పేరు చూసి,క్రేజ్ లెక్కేసుకుని భారీ రేట్లకు ఓటీటి ఫ్లాట్ ఫామ్ లు వారు సినిమాలను కొంటూ వస్తున్నారు. అయితే వీటికి చెక్ చెప్పటానికి అమేజాన్ రెడీ అయ్యింది. వరస పెట్టి డిజాస్టర్స్ వస్తూండటంతో తమ వ్యాపారం ఈ కరోనా టైమ్ లో లాభ పడుతుందనుకుంటే పూర్తి నష్టాల్లోకి కూరుకుపోయే పరిస్దితి ఏర్పడిందని వాపోతున్నారు. 

After Laxmii debacle, OTT players turn cautious jsp
Author
Hyderabad, First Published Nov 18, 2020, 3:19 PM IST

దక్షిణాదిన అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న ‘కాంచన’ సినిమాను బాలీవుడ్‌ రీమేక్ వారం క్రితం రిలీజైన సంగతి తెలిసిందే. ఈ రీమేక్‌లో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్ర పోషించాడు. రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డైరక్ట్ ఓటీటిలో రిలీజైంది. అయితే ఈ సినిమాకు డిజాస్టర్ టాక్ వచ్చింది. సినిమా చూసిన వారు బాగోలేదని సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టడం,రివ్యూలు నెగిటివ్ గానే రావటం జరిగింది. ఈ నేపధ్యంలో అమేజాన్ వారు తీసుకున్న ఓ నిర్ణయం సిని ఇండస్ట్రీకు షాక్ గా మారిందని సమాచారం. 

బాలీవుడ్ మీడియా నుంచి అందుతున్న సమాచారం మేరకు.. ఇన్నాళ్లూ హీరోలు, డైరక్టర్స్ పేరు చూసి,క్రేజ్ లెక్కేసుకుని భారీ రేట్లకు ఓటీటి ఫ్లాట్ ఫామ్ లు వారు సినిమాలను కొంటూ వస్తున్నారు. అయితే వీటికి చెక్ చెప్పటానికి అమేజాన్ రెడీ అయ్యింది. వరస పెట్టి డిజాస్టర్స్ వస్తూండటంతో తమ వ్యాపారం ఈ కరోనా టైమ్ లో లాభ పడుతుందనుకుంటే పూర్తి నష్టాల్లోకి కూరుకుపోయే పరిస్దితి ఏర్పడిందని వాపోతున్నారు. సబ్ స్కైబర్స్ పెరుగుతారని పెద్ద సినిమాలు తీసుకూంటే అవి డిజాస్టర్స్ అయ్యి...తమని ఆర్దికంగా నష్టపెడుతున్నాయని అంటున్నారు. 

అందుకు కారణం సినిమా ఎలా ఉందో చూసుకోకుండా కొనేయటమే అని అర్దం చేసుకున్నారు. దాంతో ఇక నుంచి ఓటీటిలు కొనే సినిమాలు పూర్తిగా ముందే షో చూసి , నచ్చితేనే ఎగ్రిమెంట్ చేసుకోవాలని డిసైడ్ అయ్యారట. అంతేకాదు ఇప్పటికే ఎగ్రిమెంట్ చేసుకున్న సినిమాలు సైతం తమ కంటెంట్ టీమ్ చూసి డిసైడ్ చేస్తారని చెప్తున్నారు.ఇది బాలీవుడ్ నిర్మాతలకు భారీ షాక్ గా మారిందని అంటున్నారు. త్వరలోనే అమేజాన్ లో రిలీజ్ కు ఉన్న కూలీ నెంబర్ వన్ సినిమాని తమ ఇన్ హౌస్ కంటెంట్ క్యూరేషన్ టీమ్ చూసేకే రిలీజ్ కు ఒప్పుకుంటామని తేల్చి చెప్పారట.
 

Follow Us:
Download App:
  • android
  • ios