Asianet News TeluguAsianet News Telugu

విడాకుల తర్వాత మొదటిసారి ఒకే వేదిక పంచుకున్న సమంత-నాగ చైతన్య!

సమంత-నాగ చైతన్య ఒకే వేదిక మీద సందడి చేశారు. ముంబైలో జరిగిన ఈవెంట్ లో వీరు పాల్గొన్నారు. విడాకుల అనంతరం మొదటిసారి సమంత-నాగ చైతన్య ఒక కామన్ ఈవెంట్ కి హాజరయ్యారు.

after divorce samantha and naga chaitanya participates in a common event ksr
Author
First Published Mar 19, 2024, 6:31 PM IST

టాలీవుడ్ లవ్లీ కపుల్ నాగ చైతన్య-సమంత అనూహ్యంగా విడిపోయారు. 2021లో అధికారికంగా విడాకులు ప్రకటించారు. విడాకులకు కారణాలు ఇవే అంటూ పలు పుకార్లు తెరపైకి వచ్చాయి. అయితే వాస్తవంగా ఏం జరిగింది అనేది సస్పెన్స్. నాగ చైతన్య పూర్తిగా సైలెన్స్ వహించాడు. సమంత మాత్రం పరోక్షంగా నాగ్ చైతన్య మీదున్న కోపాన్ని వెళ్లగక్కే ప్రయత్నం చేసింది. తానేమి తప్పు చేయలేదని వెల్లడించింది. 

విడాకులు తీసుకుని రెండేళ్లు దాటిపోగా సమంత-నాగ చైతన్య ఎదురుపడింది లేదు. ఎవరి దారిన వాళ్ళు బ్రతుకుతున్నారు. తమ తమ ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉన్నారు. కాగా ఎట్టకేలకు వారు ఒక కామన్ వేదిక పంచుకున్నారు. అమెజాన్ ప్రైమ్ ముంబై వేదికగా ప్రమోషనల్ ఈవెంట్ నిర్వహించింది. ప్రైమ్ ఒరిజినల్స్ ప్రాజెక్ట్స్ లో భాగమైన నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ మెగా ఈవెంట్ లో పాల్గొన్నారు. దర్శక నిర్మాత కరణ్ జోహార్ ఈ ఈవెంట్ కి హోస్ట్ గా వ్యవహరించారు. 

వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి?

సమంత సిటాడెల్ సిరీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ దర్శకులు రాజ్ అండ్ డీకే, హీరో వరుణ్ ధావన్, సమంతలను కరణ్ జోహార్ వేదికపైకి ఆహ్వానించారు. బ్యాక్ లెస్ డిజైనర్ వేర్లో సమంత మెరిసింది. సిటాడెల్ ఇండియన్ వెర్షన్ గా ఈ సిరీస్ తెరకెక్కగా... హనీ బన్నీ అని టైటిల్ పెట్టారు. పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉండగా హనీ బన్నీ స్ట్రీమ్ కానుంది. 

అలాగే దూత టైటిల్ తో నాగ చైతన్య క్రైమ్ థ్రిల్లర్ చేశారు. గత ఏడాది విడుదలైన ఈ సిరీస్ భారీ విజయం అందుకుంది. విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహించాడు. త్వరలో దూత 2 ని ప్రకటించనున్నారని సమాచారం. ఈ క్రమంలో అమెజాన్ ప్రైమ్ ఈవెంట్ కి నాగ చైతన్యకు ఆహ్వానం దక్కింది. నాగ చైతన్య మాట్లాడటం జరిగింది. ఆ విధంగా సమంత-నాగ చైతన్య ప్రైమ్ ప్రమోషనల్ ఈవెంట్లో భాగం అయ్యారు. 

అయితే వీరిద్దరూ కలిసి ఈ ఈవెంట్ కి హాజరుకాలేదు. కాబట్టి వాళ్ళు మాట్లాడుకోలేదు. ఒక కామన్ ఈవెంట్ కి హాజరు అయ్యారంతే. అదన్నమాట మేటర్. కాగా నాగ చైతన్య తండేల్ టైటిల్ తో ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కిస్తుండగా గీతా ఆర్ట్స్ నిర్మిస్తున్నారు. తండేల్ చిత్రంలో నాగ చైతన్య జాలరి రోల్ చేస్తున్నాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios