స్టార్ హీరోలకు క్షణం తీరిక ఉండదు. షూటింగ్స్, మీటింగ్స్ తో ఎప్పుడూ బిజీనే. కోట్ల ఆస్తులు ఉన్నా అనుభవించే తీరిక ఉండదు.ఇక రామ్ చరణ్, ఉపాసనల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరైన చరణ్ (Ram Charan)నటుడిగా చాలా బిజీ. ఆయన భార్య ఉపాసన లైఫ్ కూడా అంతే. అపోలో హాస్పిటల్స్ చైర్ పెర్సన్ గా ఆమెకు అనేక బాధ్యతలు ఉన్నాయి. వాటితో పాటు బి పాజిటివ్ పేరుతో ఫ్యాషన్, లైఫ్ స్టైల్ మ్యాగజైన్ నడుపుతున్నారు. ప్రొఫెషనల్ గా రామ్ చరణ్, ఉపాసనలకు కొంచెం కూడా ఖాళీ సమయం దొరకదు. అయితే చాలా కాలం తర్వాత రామ్ చరణ్ కొంచెం ఫ్రీ అయ్యారు. దర్శకుడు శంకర్ తో చేస్తున్న RC 15కి షూట్ నుండి విరామం దొరికింది. ఈ విరామ సమయాన్ని వెకేషన్ ప్లాన్ చేశారు. ఆయన భార్య ఉపాసనతో కలిసి విహారానికి చెక్కేస్తున్నారు.
ఈ విషయాన్ని ఉపాసన(Upasana) ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. రెండేళ్ల తర్వాత మిస్టర్ సీ(రామ్ చరణ్) తో వెకేషన్ కి వెళుతున్నట్లు తెలియజేశారు. భర్తతో తన హ్యాపీ మూమెంట్ కి సంబంధించిన ఫోటో షేర్ చేసింది. మరి చరణ్-ఉపాసనల వివాహారం ఎక్కడకు, ఎన్ని రోజులనే విషయంలో మాత్రం స్పష్టత లేదు. రెండేళ్ల క్రితం ఆఫ్రికా దేశంలో సఫారీ టూర్ కి వెళ్లారు. సాహసోపేతమైన ఈ టూర్ లో ఉపాసన, చరణ్ క్రూర మృగాల మధ్య గడిపారు. ఆఫ్రికా అడవుల్లో వెకేషన్ తో పాటు వైల్డ్ లైఫ్ ఫోటో షూట్ కూడా చేశారు. సదరు ఫోటోలను తమ ఇంటిలో ఓ ప్రదర్శన ఏర్పాటు చేసి మిత్రులను పిలిచి అనుభవాలను పంచుకున్నారు.
అయితే ఈసారి టూర్ కొద్దిరోజులు మాత్రమే ఉండే అవకాశం కలదు. మార్చి 25న ఆర్ ఆర్ ఆర్ (RRR Movie)విడుదల నేపథ్యంలో చరణ్ ప్రమోషన్స్ లో పాల్గొనాల్సి ఉంది. దీని కోసం ఆయన త్వరగానే టూర్ ముగించుకొని రావచ్చు. ఇక శంకర్ తో రామ్ చరణ్ చేస్తున్న మూవీ భారీ ఎత్తున తెరకెక్కుతుంది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
కాగా చరణ్ ఫ్యాన్స్ కి వరుస ట్రీట్స్ సిద్ధం చేశారు. మరో రెండు వారాల్లో ఆర్ ఆర్ ఆర్ విడుదల కానుంది. దేశవ్యాప్తంగా ఆర్ ఆర్ ఆర్ పై భారీ హైప్ నెలకొని ఉంది. రాజమౌళి తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ మూవీలో ఎన్టీఆర్ కొమరం భీమ్ రోల్ చేస్తుంటే, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ విడుదలైన నెల రోజుల్లో ఆచార్య విడుదలకు సిద్ధంగా ఉంది. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఆచార్య మూవీలో చిరంజీవి, చరణ్ మొదటిసారి పూర్తి స్థాయి మల్టీస్టారర్ చేస్తున్నారు. ఇక శంకర్ మూవీ 2023 సంక్రాంతి కానుకగా విడుదల కానుందని సమాచారం.
