పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని మెగా అభిమానులు ఎంతగా ఆరాధిస్తారో అదే విధంగా ఆయన పెద్ద కుమారుడైన అకిరా నందన్ ని కూడా అంతే ఇష్టపడతారు. పవన్ సినిమాలకు దూరమైనప్పటికీ అకిరా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే బావుంటుందని అంతా కోరుకుంటున్నారు. 

ఇకపోతే అకిరాకు సంబందించిన ఫొటోలు సోషల్ మీడియాలో ఏ విధంగా వైరల్ అవుతాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. రీసెంట్ గా అడివి శేష్ తో పవన్ పిల్లలు  సరదాగా గడిపారు. వీరి కలయిక ఎలా జరిగిందో తెలియదు గాని సోషల్ మీడియాలో అందుకు సంబదించిన ఫొటో ఒకటి  వైరల్ గా మారింది. అకిరాతో పాటు పవన్ కూతురు ఆద్య కూడా ఆ ఫొటోలో కనిపిస్తున్నారు. 

ఇక ఇటీవల అడివి శేష్ ఎవరు సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ ని ప్రతి ఒక్కరితో షేర్ చేసుకుంటున్న శేష్ నెక్స్ట్ మేజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.