#Hit2:‘హిట్ 2’..వీకెండ్ దాటగానే వీక్ అయ్యిపోయిందే
ఈ సినిమాని ముఖ్యంగా యూత్ చూస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది.

గత శుక్ర వారం అడివి శేష్ నటించిన 'హిట్ 2' విడుదల అయింది. ఈ సినిమాకి ఓపెనింగ్స్ అడివి శేష్ కెరీర్ లో బెస్ట్ . హిట్ టాక్ వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ఇప్పుడు మూడు రోజుల వీకెండ్ కలెక్షన్స్ దుమ్ము రేపాయి. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ 'హిట్ 2' లో అడివి శేష్ ఓ మర్డర్ మిస్టరీ పరిశోధన చేసే అధికారిగా కనపడతాడు. కలెక్షన్స్ వైజ్ గా సినిమా బాగానే వర్కవుట్ అయ్యింది.
అయితే వీకెండ్ దాటిన సోమవారం నుంచి పూర్తి డ్రాప్ ప్రారంభం అయ్యింది. మొదటి సోమ,మంగళవారాలలో షేర్ బాగా తక్కువ వచ్చింది. దాదాపు 70 శాతం దాకా డ్రాప్ ఉందని సమాచారం. దాంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ దాకా వచ్చి ఆగిపోతుందా అనే సందేహాలు మొదలయ్యాయి. ఎంత పుష్ ఇచ్చి పబ్లిసిటీ చేసినా సినిమా అనుకున్న స్దాయిలో పుంజుకోవటం లేదు. ముఖ్యంగా మల్టిప్లెక్స్ లు ఉన్న రెవిన్యూ...బి,సి సెంటర్లలలో కనపడటం లేదు.
ఈ సినిమాని ముఖ్యంగా యూత్ చూస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. ఆదివారం నాడు ఈ సినిమా నందమూరి బాలకృష్ణ కూడా చూసి చాలా బాగుంది అని చెప్పటం తో సినిమాకి మరింత హైప్ వచ్చిందని సమాచారం. ఇప్పటికే కలెక్షన్లతో దూసుకుపోతున్న ఈ సినిమా అడివి శేష్ కెరీర్ లో బెస్ట్ అవుతుందని అని ట్రేడ్ పండితుల అభిప్రాయం.
ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మంచి బిజినెస్ చేసింది.
👉నైజాం– 4.00కోట్లు
👉సీడెడ్ – 1.75కోట్లు
👉ఆంధ్రా – 4.50కోట్లు
మొత్తం ఆంధ్రా, తెలంగాణా కలిపి – 10.25కోట్లు
👉కర్ణాటక+భారత్ లో మిగతా ప్రాంతాలు – 1.50కోట్లు
👉ఓవర్ సీస్ - 2.50కోట్లు
మొత్తం ప్రపంచ వ్యాప్తంగా జరిగిన బిజినెస్ :- 14.25కోట్లు( బ్రేక్ ఈవెన్ – 15కోట్లు+)
గమనిక: భాక్సాఫీస్ డేటా....వివిధ సోర్స్ ల నుంచి సేకరించుకున్నది..అఫీషియల్ సమాచారం కాదు.
ఇక హిట్ 2లో రొటీన్ ట్విస్ట్ అయినా... స్క్రీన్ ప్లే బాగుంటుంది.హత్య చేసింది సీరియల్ కిల్లర్ అనే ముందే చెప్పారు. ఆ కిల్లర్ ఎవరు? ఎందుకు అమ్మాయిలనే చంపుతున్నారనేది సస్పెన్స్‌గా పెట్టారు. ఫస్టాఫ్ అంతా సింపుల్‌గా కొనసాగుతుంది. హీరో రొమాన్స్.. మధ్యలో కేసు విచారణ.. ఈక్రమంలో కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడంతో ఫస్టాఫ్ ముగుస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా సింపుల్‌గా ఉంటుంది. సెకండాఫ్ నుంచి కథ పరుగులు పెట్టించటమే కలిసొచ్చింది.