సోషల్ మీడియా ఎవరికీ ఉన్నా లేకపోయినా సెలబ్రెటీలకు మాత్రం తప్పనిసరిగా ఉండాల్సిన ఆధార్ లా మారింది. ప్రేక్షకులకు దగ్గరగా ఉండాలంటే ముఖ్యంగా ట్విట్టర్ చాలా ఉపయోగపడుతుంది. ఖాళి సమయాల్లో అలాగే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చాలా మంది సినీ తారలు డైరెక్ట్ గా నెటిజన్స్ తో చాట్ చేస్తున్నారు. 

రీసెంట్ గా ఎవరు సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న అడివి శేష్ కూడా తన ట్విట్టర్ ద్వారా అభిమానులు అడిగిని ప్రశ్నలకు కూల్ గా ఆన్సార్ ఇచ్చాడు. మెయిన్ గా చాలా మంచి నెటిజన్స్ వారికి ఇష్టమైన యువ హీరోల గురించి ఒక మాటలో చెప్పమని కామెంట్ చేశారు. అందుకు అడివి శేష్ తెలివిగా అన్సార్ ఇస్తూ వస్తున్నాడు. 

ముఖ్యంగా ప్రభాస్ గురించి ఒక్క మాటలో ఏం చెబుతారని చాలా మంది అడగ్గా.. ఒక్క మాటలో రెబల్ స్టార్ గురించి చెప్పలేమని అన్నాడు. ఇక నితిన్ తనకు ఇండస్ట్రీలో చాలా క్లోజ్ ఫ్రెండ్ అని విజయ్ దేవరకొండ కూడా చాలా మంచి వ్యక్తి అని వివరించారు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలం సినిమాలో అద్భుతంగా నటించినట్లు అడివి శేష్ సమాధానం ఇచ్చారు.