Asianet News TeluguAsianet News Telugu

అడివి శేష్ ను డేట్ అడిగిన అమ్మాయి. అదిరిపోయే ఆన్సర్ ఇచ్చిన హిట్ 2 హీరో

హిట్ 2 మూవీ జోష్ లో ఉన్నాడు అడివి శేష్. వరుససక్సెస్ లతో దూసుకుపోతున్న ఈ యంగ్ హీరో కి ఈమధ్య ఓ లేడీ ఫ్యాన్స్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. దానికి తగ్గట్టుగానే స్పందించాడు శేష్. ఇంతకీ ఆఫన్నీ ఇన్సిడెంట్ ఏంటంటే..? 
 

Adivi Sesh Shocking Reply to Netizens
Author
First Published Dec 5, 2022, 11:42 AM IST

టాలీవుడ్ యంగ్ హీరో అడ‌వి శేష్ న‌టించిన లేటెస్ట్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ హిట్ 2.  ఈమూవీ సక్సెస్ కిక్ లో ఉన్నాడు అడివి శేష్.హీరో నాని నిర్మాతగా.. హిట్  సినిమాకు సీక్వెల్‌గా వ‌చ్చిన ఈ సినిమా ... సూపర్ డూపర్ హిట్ కొట్టింది.  ఈ సినిమాతో డబుల హ్యాట్రిక్ హిట్ కొట్టాడు అడివి శేష్. ఎన్టీఆర్  త‌ర్వాత టాలీవుడ్ నుంచి ఒక్క అడ‌వి శేష్‌కు మాత్ర‌మే ఆరు వ‌రుస హిట్లు ప‌డ్డాయి. దాంతో టాలీవుడ్ లో అడివి శేష్ ఇమేజ్ తో పాటు డిమాండ్ కూడా పెరిగిపోయింది. చిన్న హీరోగా ఎంటర్ అయ్యి వరుస విజయాలతోదూసుకుపోతున్న శేష్ కు మార్కెట్ కూడా అమాంతం పెరిగిపోయింది. 

అంతే కాదు ఫ్యాన్ ఫాలోయింగ్ లో కూడా శేష్.. కాస్త ముందడుగేశాడనే చెప్పాలి. ఎందకుంటే ఓ స్టార్ హీరో వెంట ఎలాగైతే పడతారో..  అదే రేంజ్ లో అడివి శేష్ కు కూడా లేడీఫాలోయింగ్ విపరీతంగాపెరిగిపోయింది అంతే కాదు అతనితో డేట్ కు రెడీ అవుతున్నారు లేడీ ఫ్యాన్స్.. హిట్ 2 సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోన్న అడివి శేష్.. ఆ సంతోషాన్ని ట్వి్టర్ ద్వారా పంచుకున్నారు. 

ఇక సరిగ్గా అదే సమయంలో  ఓ అమ్మాయి మ‌నం ఎప్పుడు డేట్‌కు వెళ‌దాం అంటూ కొంటెగా క‌వ్విస్తూ.. శేష్ కు ఆఫర్ చేసింది. ఇక ఏమాత్రం తడబడకుండా అడివి శేష్ వెంటనే రిప్లై ఇచ్చాడు.  ఇదిగో ఇప్పుడే వ‌చ్చేస్తున్నా.. మ‌నం ఇద్ద‌రం క‌లిసి హిట్ 2 సినిమా చూద్దాం అని ఆన్సర్ చేశాడు.దాంతో ఆ అమ్మాయితో పాటు.. నెటిజన్లు షాక్ అయ్యారు. 

అంతే కాదు... మరో   నెటిజ‌న్ ఏమన్నాడంటే.. హిట్ యూనివ‌ర్స్‌లోకి మ‌హేష్‌బాబును ఎంట్రీ చేయిస్తే నెక్ట్స్ లెవ‌ల్‌కు వెళ్లిపోతుంద‌ని అన్నాడు. ఓ మంచి స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ లైన్ రాసి మ‌హేష్ అన్న‌తో చేయండ‌న్న‌.. అది నా కోరిక అని చెప్పాడు. దాపిరి వెంట‌నే శేష్ స్పందిస్తూ.. ఈ రోజు ఉద‌య‌మే ఆయ‌న ఫోన్ చేసి చాలా సేపు మాట్లాడారు. నా విష‌యంలో ఆయ‌న గ‌ర్వంగా ఫీల‌వుతున్నాన‌ని చెప్పారు. ఆ వెంట‌నే నా క‌ళ్ల‌లో నీళ్లు తిరిగాయ‌ని శేష్ చెప్పాడు.

మహేష్ బాబు ఎప్పుడు నా బ్రదర్ లా  వెన్నంటే ఉంటాన‌ని చెప్పార‌ని.. ఆయ‌న‌కు హిట్ 2 సినిమా ఎప్పుడెప్పుడు చూపించాలా అని ఆస‌క్తితో వెయిట్ చేస్తున్నాన‌ని చెప్పారు. ఇక అడ‌వి శేష్ తోమహేష్ కి ప్రత్యేక అనుబంధం ఉంది గూఢ‌చారి సినిమా ట్రైల‌ర్‌తో మెస్మ‌రైజ్ అయిన మ‌హేష్ శేష్ హీరోగా  మేజ‌ర్ సినిమాను నిర్మించారు. ఈమూవీ కూడా సూపర్ హిట్ అయ్యింది. త్వరలో వీరి కాంబోలో సినిమా వచ్చే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios