క్ష‌ణం, గూఢ‌చారి వంటి చిత్రాలతో సూపర్ హిట్లను అందుకున్న నటుడు అడివి శేష్ తాజాగా మరో సినిమాలో నటిస్తున్నాడు. 'క్షణం' సినిమాను నిర్మించిన పివిపి ఈ సినిమాకు కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 

థ్రిల్లర్ నేపధ్యంలో సాగనున్న ఈ సినిమాకి 'ఎవరు' అనే టైటిల్ ని ఫైనల్ చేశారు. తాజాగా సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్ ని విడుదల చేశారు. ఈ సినిమాతో వెంకట్ రామ్ జీ డైరెక్టర్ గా పరిచయం కాబోతున్నారు.

రెజీనా హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో నవీన్ చంద్ర కీలక పాత్రలో కనిపించనున్నారు. శ్రీచ‌ర‌ణ్ పాకాల సంగీత సార‌థ్యం వ‌హిస్తున్న ఈ చిత్రానికి వంశీ ప‌చ్చిపులుసు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమానుఆగ‌స్ట్ 23న సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.