మహేష్ బాబు లాంటి స్టార్ అండదండలు ఈ సినిమాకి ఉండడం, అడవిశేష్.. హీరోగా నటించడంతో ఈ సినిమాపై ఫోకస్ పెరిగింది. ముఖ్యంగా యుఎస్ లో ఈ సినిమా కలెక్షన్స్ దుమ్ము రేపటం ఫ్యాన్స్ కు పండగ చేసుకునే వాతావరణం క్రియేట్ చేస్తున్నాయి.
31 ఏళ్ల వయసులోనే… అశువులు బాసి, అమరుడయ్యిన `మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్`జీవితాన్ని యూత్ కు ప్రేరణగా తీర్చిదిద్దే ప్రయత్నం చేసిన చిత్రం 'మేజర్' . ఈ దేశం అశోక చక్ర బిరుదుతో ఘనంగా నివాళి అర్పించిన ఓ వీరుడు గురించి ఈ సినిమా మాట్లాడుతుంది. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన ఓ సైనికుడి కథ ఎప్పుడూ ఎమోషనలే కావటంతో ఈ సినిమా ఓ వర్గానికి బాగానే కనెక్ట్ అయ్యింది. దాంతో `మేజర్` కలెక్షన్స్ గురించి సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరో ప్రక్క మహేష్ బాబు లాంటి స్టార్ అండదండలు ఈ సినిమాకి ఉండడం, అడవిశేష్.. హీరోగా నటించడంతో ఈ సినిమాపై ఫోకస్ పెరిగింది. ముఖ్యంగా యుఎస్ లో ఈ సినిమా కలెక్షన్స్ దుమ్ము రేపటం ఫ్యాన్స్ కు పండగ చేసుకునే వాతావరణం క్రియేట్ చేస్తున్నాయి.
ఈ సినిమా ట్రైలర్ బాగా క్లిక్ అవటంతో ఈ సినిమాపై బజ్ బాగా క్రియేట్ అయ్యింది. ఎక్సపెక్టేషన్స్ తగ్గట్లు సినిమా ఉందా అంటే చాలావరకూ ఉందనే చెప్పాలి. అందుకు తగ్గట్లే అమెరికా ప్రీమియర్ సేల్స్ అదరకొట్టాయి. అక్కడ ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా ప్రీమియర్స్, మొదటి రెండు రోజుల రన్ కలిపి $700k వసూలు చేసాయి. అడవి శేషు కెరీర్ లో ఇది బెస్ట్ ఓపినింగ్. తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా చోట్ల కొత్త స్క్రీన్స్ యాడ్ చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే మిలియన్ మార్క్ ని క్రాస్ చేస్తుందని అంచనా వేస్తున్నారు.
ఈ సినిమా కథ మొత్తం.. 'నా కొడుకు జీవితం ఆ రోజు జరిగిన ఎటాక్స్ మాత్రమే కాదమ్మా! సందీప్ కంటూ ఒక జీవితం ఉంది' - అంటూ సందీప్ ఉన్నికృష్ణన్ తల్లి పాత్ర పోషించిన రేవతి చెప్పే డైలాగు పైనే ఆధారపడి ఉంది. ఇస్రో ఆఫీసర్ ఉన్నికృష్ణన్ కుమారుడు సందీప్ (అడివి శేష్). అందరు సగటు తండ్రిలులాగే తన కొడుకు బాగా చదువుకుని డాక్టరో ఇంజినీరో సెటిలవ్వాలనేది ఉన్నికృష్ణన్ కోరిక. అయితే సందీప్ మాత్రం ఎయిర్ ఫోర్స్ లో చేరాలని,దేశానికి సేవ చేయాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో ఇంట్లో వాళ్లకు ఇష్టం లేకపోయినా.. తాను కోరుకున్నట్లే సైన్యంలో చేరతాడు. కాస్త సెటిల్ అయ్యాక తాను స్కూల్ డేస్ లో ప్రేమించిన ఇషా (సయీ మంజ్రేకర్)ను పెళ్లి చేసుకుంటాడు.
ఆమె ఎప్పుడూ సందీప్ పై కంప్లైట్స్ చెప్తూనే ఉంటుంది. తనకెప్పుడూ టైమ్ కేటాయించడం లేదని నేహా ఫిర్యాదు. కానీ సందీప్‌కి మొదటి నుంచి ఇల్లు, కుటుంబం కంటే దేశమే ఎక్కువ. అందుకే… నేహాతో విబేధాలు వస్తాయి. మరోవైపు.. సైన్యంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుని, న్.ఎస్.జీ కమాండోలకు శిక్షణ ఇచ్చే స్థాయికి చేరుకుంటాడు. అదే సమయంలోనే ముంబయిలో తాజ్ హోటల్ మీద ఉగ్రవాదులు దాడి జరుగురుంది. హోటల్లో వందల మందిని బందీలుగా తీసుకున్నారని తెలుసుకుంటాడు . `51 ఎస్.ఏ.జీ` బృందానికి సారథ్యం వహిస్తూ ఉగ్రవాదులతో ఎలా పోరాడాడు.. బందీలను ఎలా రక్షించాడు.. ఈ పోరాటంలో అతను ఎలా వీరమరణం పొందాడు అన్నది `మేజర్` కథ.
