వైవిధ్యమైన యాక్షన్ కథలు ఎంచుకుంటూ సరికొత్త పంథాలో దూసుకుపోతున్న హీరో అడివి శేష్. క్షణం, గూఢచారి, ఎవరు ఇలా వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు.

వైవిధ్యమైన యాక్షన్ కథలు ఎంచుకుంటూ సరికొత్త పంథాలో దూసుకుపోతున్న హీరో అడివి శేష్. క్షణం, గూఢచారి, ఎవరు ఇలా వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం అడివి శేష్ నటిస్తున్న 'మేజర్' చిత్రం చాలా ప్రత్యేకమైనది. 

26/11 ముంబై దాడులలో ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడి ప్రాణాలు విడిచిన బ్రేవ్ సోల్జర్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో అడివి శేష్ నటిస్తున్నారు. మరో ప్రత్యేకత ఏంటంటే ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబు తన జిఎంబి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనితో ఈ చిత్రంపై ప్రతి ఒక్కరిలో ఆసక్తి నెలకొంది. 

జూన్ 3న రిలీజ్ కాబోతున్న ఈ చిత్ర ట్రైలర్ ని సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా లాంచ్ చేశారు. ట్రైలర్ ఆధ్యంతం గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉండనే చెప్పాలి. ఎంతటి సాహసం అయినా ఎదురెళ్ళే దూకుడు స్వభావం ఉన్న సోల్జర్ గా అడివి శేష్ అదరగొడుతున్నాడు. 

అతడి తండ్రి పాత్రలో ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు. ట్రైలర్ లో యాక్షన్ సన్నివేశాలు అబ్బురపరిచే విధంగా ఉన్నాయి. 'టైంకి వెళ్ళకపోవడం వల్ల ఒక్క ప్రాణం పోయినా లైఫ్ లో నన్ను నేను సోల్జర్ అనుకోలేను సర్' అంటూ శేష్ చెబుతున్న డైలాగ్ బావుంది. 

'నా కొడుకు.. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్.. తప్పించుకునే అవకాశం ఉంది.. వెనకడుగు వేసే అవకాశం ఉంది.. కానీ చావు కళ్ళలోకి చూస్తూ ఎదురెళ్ళాడు' అంటూ ప్రకాష్ రాజ్ తన కొడుకు గురించి చెబుతున్న మాటలు రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తున్నాయి. ట్రైలర్ పై మీరూ ఓ లుక్కేయండి. 

YouTube video player