అడవి శేషు ఇప్పుడు లీగల్ సమస్యలో ఇరుక్కున్నారు. ఆయన సినిమా కోర్టు లో పడింది .. మంచి కథ కోసం వెయిట్ చేసి లాంచ్ చేద్దామనుకుని ప్లాన్ చేసిన టూ స్టేట్స్ సినిమాలో వివాదం చోటు చేసుకుంది . ఈ విషయంలో నిర్మాత ఎమ్ఎల్ వి సత్యనారాయణ కోర్ట్ కెక్కాడు . జడ్జి ఈ సినిమా విషయంలో హీరో అడవి శేషుని జనవరి 5,2021లోగా స్పందించాలని కోరినట్లు సమాచారం.
  
 చేతన్‌భగత్‌ రచించిన ‘2 స్టేట్స్‌’ నవల ఆధారంగా హిందీలో ‘2 స్టేట్స్‌’ సినిమా తీసారు. బాలీవుడ్ లో సూపర్ హిట్టైన 2 స్టేట్స్ సినిమాను తెలుగులో రీమేక్ మొదలెట్టారు.  ఇందులో శివాని హీరోయిన్.  అడవి శేష్ హీరో.  సినిమా షూటింగ్ ప్రారంభమయ్యి చాలాకాలం అయినప్పటికీ... కొన్ని కారణాల వలన ముందుకు వెళ్లలేదు.  ఈ ప్రాజెక్ట్ నుంచి అడవి శేష్ తప్పుకుంటున్నాడని వార్తలు వచ్చాయి. శేషు క్యారెక్టర్ ను సరిగా డిజైన్ చేయకపోవడమే ఇందుకు కారణం అని అన్నారు.

అయితే ఈ సినిమా రీమేక్ కునిర్మాత మొదట్లో బాగా సపోర్ట్ చేసాడని కానీ మధ్యలో కొందరి మాటలు విని కధలో మార్పులు చేయమని లేకుంటే తప్పిస్తామని అనడం దర్సకుడికి బాగా కోపం వచ్చే కోర్టుకు వెళ్లాడంటున్నారు… దాదాపు డెబ్భై శాతం కంప్లీట్ చేసాక నన్ను అడ్డుకుంటారా అని కోర్టు కి వెళ్ళాడు. లక్ష్య ప్రొడక్షన్స్‌, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఎం.ఎల్‌.వి.సత్యనారాయణ నిర్మిస్తున్నారు. వెంకట్‌ కుంచం దర్శకుడు.