Asianet News TeluguAsianet News Telugu

మహేష్ సర్ మీకు తమ్ముడిలా తోడుంటా.. అడివి శేష్ ఎమోషనల్ కామెంట్స్

అడివి శేష్ మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. డిసెంబర్ 2న విడుదలైన హిట్ 2 చిత్రం పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. నేచురల్ స్టార్ నాని ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేసిన సంగతి తెలిసిందే.

Adivi Sesh emotional comments on Mahesh Babu
Author
First Published Dec 6, 2022, 1:54 PM IST

అడివి శేష్ మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. డిసెంబర్ 2న విడుదలైన హిట్ 2 చిత్రం పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. నేచురల్ స్టార్ నాని ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఒక ప్రాంఛైజీలా హిట్ సిరీస్ కొనసాగనుంది. హిట్ 2 ఘనవిజయం సాధించడంతో హిట్ 3పై ఇప్పటి నుంచే బజ్ మొదలైంది. 

హిట్ 3లో నేచురల్ స్టార్ నాని హీరోగా నటించబోతున్నాడు. ఈ క్రేజీ అప్డేట్ ని హిట్ 2 చివర్లో రివీల్ చేశారు. ఇక హిట్ 2లో అడివి శేష్ తన పెర్ఫామెన్స్ తో అదరగొట్టేసినట్లు ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నాయి.  అడివి శేష్ హిట్ 2 సక్సెస్ సెలెబ్రేషన్స్ లో మాట్లాడుతూ ఈ చిత్రం ద్వారా ఎదురైన స్వీట్ మెమొరీస్ గుర్తు చేసుకున్నాడు. 

హిట్ 2 రిలీజ్ రోజు ప్రీమియర్ షోలు మొదలయ్యాక నాకు వరుసగా ఫోన్ కాల్స్ స్టార్ట్ అయ్యాయి. మహేష్ బాబు సర్ మూడు మిస్ కాల్స్ చేసి ఉన్నారు. ఏమైందో ఏమో అని కంగారుగా ఫోన్ చేశా. ఏమైంది సర్ అని అడిగితే.. నిన్ను చూస్తే గర్వంగా ఉంది శేష్ అని అన్నారు. అక్కడ నాకు ఒక యుఫోరియా మొదలయ్యింది. ఆ మాట అనగానే నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వెంటనే సర్ మీరు ఒకే సంవత్సరం ముగ్గురిని కోల్పోయారు. 

అది ఎవరూ భరించలేని చేదు అనుభవం. సర్ మీ చుట్టూ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అంతా ఉన్నారు. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి.. మీకు ఒక తమ్ముడిలా ఎప్పుడూ తోడుంటా అని చెప్పినట్లు అడవి శేష్ తెలిపాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios