టాలెంటెడ్ హీరో అడివి శేష్.. పవన్ కళ్యాణ్ పిల్లలు అకీరా, ఆద్య తో ఉన్న ఓ ఫోటో సోమవారం రోజు వైరల్ అయింది. తాజాగా అడివి శేష్.. రేణు దేశాయ్, అకీరాతో ఉన్న మరిన్ని ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. రేణు దేశాయ్, అకీరా, ఆద్యలని వారి నివాసంలో కలుసుకున్నట్లు శేష్ వివరించాడు. 

ఈ సందర్భంగా అకీరా గురించి శేష్ ఆసక్తికర విషయాలు తెలియజేశాడు. అందమైన కుర్రాడు అకీరాతో ఈ రోజు గడిపా. అకీరాకు ఎవరు చిత్రం చాలా బాగా నచ్చింది. లంచ్ మీటింగ్ లో అనేక విషయాలు మాట్లాడుకున్నాం. అకీరా వాయిస్ చాలా గంభీరంగా ఉంది. అకీరా పొడవు 6 అడుగుల 4 అంగుళాలు. మేమిద్దరం ఎడమచేతి వాటం కలిగిన వాళ్ళం. అంతే కాదు మా ఇద్దరిలో అనేక కామన్ విషయాలు ఉన్నాయి అని అకిరా గురించి శేష్ చెప్పుకొచ్చాడు. 

ఇక రేణు దేశాయ్ అద్భుతమైన రచయిత అని అడివి శేష్ ప్రశంసలు కురిపించాడు. అడివి శేష్.. రేణు దేశాయ్, అకీరాతో కలసి దిగిన సెల్ఫీలు వైరల్ అవుతున్నాయి. అడివి శేష్, రెజీనా నటించిన ఎవరు చిత్రం ఇటీవల విడుదలై మంచి విషయాన్ని సొంతం చేసుకుంది. విభిన్నమైన చిత్రాలతో అడివి శేష్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకుంటున్నాడు.