టాలీవుడ్ లో సంచలన విజయాన్ని అందుకున్న అర్జున్ రెడ్డి బాలీవుడ్ లో కబీర్ సింగ్ గా తెరకెక్కి మరో వండర్ క్రియేట్ చేసింది. బాలీవుడ్ టాప్ బాక్స్ ఆఫీస్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. అయితే ఇప్పుడు అర్జున్ రెడ్డి కథ కోలీవుడ్ లో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

ఆదిత్య వర్మగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఫైనల్ గా సోమవారం పూర్తయ్యింది. విక్రమ్ తనయుడు ధృవ్ ఈ సినిమా ద్వారా కథానాయకుడిగా పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. బాణిత సందు హీరోయిన్ గా కనిపించనుంది.  ఇప్పటికే టీజర్ ని రిలీజ్ చేసి అంచనాలను రేపిన చిత్ర యూనిట్ రెగ్యులర్ ప్రమోషన్స్ డోస్ కూడా పెంచనుంది. 

వీలైనంత త్వరగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసి త్వరలో సాంగ్స్ టీజర్స్ తో రచ్చ చేయాలనీ అనుకుంటున్నారు. ముఖ్యంగా సినిమా ట్రైలర్ మరింత స్ట్రాంగ్ గా ఉండాలని నిర్మాత దర్శకుడు ఆలోచిస్తున్నారట. విక్రమ్ ప్రమోషన్ విషయంలో దర్శకుడు గిరీశయకు పూర్తి ఫ్రీడమ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 

ఇప్పటికే కొన్ని వర్గాల నుంచి సినిమాకు విమర్శలు అందుతున్నాయి. ముందు రోజుల్లో ఆ డోస్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక ఏది ఏమైనా ట్రైలర్ తోనే సినిమా స్థాయిని పెంచాలని అనుకుంటున్నారట. మరి ఈ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.