న్యాచురల్ స్టార్ నానితో సినిమా చేయడానికి ఏ హీరోయిన్ అయినా కండిషన్స్ లేకుండా ఒప్పుకుంటుంది. ఇకపోతే గత కొన్నేళ్లుగా జయాపజయాలతో సంబంధం లేకుండా అవకాశాలు అందుకుంటున్న హాట్ బ్యూటీ కూడా న్యాచురల్ స్టార్ నానితో ఒక సినిమా చేయడానికి సింగిల్ సిట్టింగ్ లో ఒప్పేసుకుంది. 

హైదరాబాద్ బ్యూటీ అదితి రావ్ హైదారి నెక్స్ట్ నానితో రొమాన్స్ చేయడానికి సిద్ధమైంది. సమ్మోహనం సినిమాతో సరికొత్తగా ఆడియెన్స్ ని పలకరించిన అదితి ప్రస్తుతం నార్త్ సౌత్ అని తేడా లేకుండా అవకాశాలను అందుకుంటోంది. ఇక మరోసారి లైఫ్ ఇచ్చిన సమ్మోహనం దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నటించబోతోంది. 

అష్టాచమ్మా - జెంటిల్ మెన్ వంటి హిట్స్ తో ఇండస్ట్రీని ఆకర్షించిన మోహన కృష్ణ ఇంద్రగంటి నెక్స్ట్ నానితో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని ఒక డిఫరెంట్ కథను సెట్ చేస్తున్నాడు. పనిలో పనిగా నటీనటులను కూడా ఫైనల్ చేస్తున్నాడు. అయితే అదితి రావ్ హైదరి కాన్సెప్ట్ వినకుండానే నాని సినిమాకు డేట్స్ ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం నాని జెర్సీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు.