యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన బాహుబలి చిత్రం తెలుగు సినిమా మార్కెట్ స్వరూపాన్నే మార్చేసింది. బాహుబలి చిత్రం రెండు భాగాలుగా విడుదలై అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి చిత్రాన్ని తెరకెక్కించారు. 

అంతర్జాతీయ స్థాయిలో బాహుబలి చిత్రం అనేక ఘనతలు సాధిస్తూ ఇప్పటికి వార్తల్లో నిలుస్తోంది. ఇదిలా ఉండగా బాహుబలి చిత్రానికి ఉన్న క్రేజ్ తో తమిళంలో మరోసారి రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. బాహుబలి ది బిగినింగ్ చిత్రాన్ని ఈ శుక్రవారం నవంబర్ 22న తమిళనాడులో రిలీజ్ చేస్తున్నారు. 

అదే రోజున స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ నటించిన అర్జున్ రెడ్డి రీమేక్ ఆదిత్య వర్మ రిలీజ్ కానుంది. ఈ రెండు చిత్రాలు ఒకే రోజు విడుదల కానుండటం ఆసక్తి నెలకొంది. కానీ బాహుబలి చిత్రం నుంచి ఆదిత్య వర్మకు పెద్దగా సమస్య ఉండకపోవచ్చు. 

బ్రేకింగ్: రామానాయుడు స్టూడియోపై ఐటీ దాడులు!

బాహుబలి చిత్రాన్ని పరిమిత సంఖ్యలోని థియేటర్స్ లో మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. ఆల్రెడీ విడుదలై తిరిగి మరోసారి విడుదల అవుతుండడం వల్ల ప్రేక్షకుల తాకిడి కూడా తక్కువగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. దీనితో అందరి చూపు ధృవ్ నటించిన ఆదిత్య వర్మపైనే ఉండబోతోంది. విలక్షణ నటనకు మరో పేరు అయిన విక్రమ్ వారసుడిగా ధృవ్ ఎలా నటించాడనే ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది. 

ఆదిత్య వర్మ చిత్రంలో ధృవ్ కి హీరోయిన్ గా యంగ్ బ్యూటీ బనిత సందు నటిస్తోంది. హీరోయిన్ ప్రియా ఆనంద్ ఈ మూవీలో కీలక పాత్రలో నటించింది. గిరిసాయి ఈ చిత్రానికి దర్శకుడు.