స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా నటిస్తున్న తొలి చిత్రం ఆదిత్య వర్మ. ఈ చిత్రం తెలుగు సెన్సేషనల్ మూవీ అర్జున్ రెడ్డికి రీమేక్ గా తెరకెక్కుతోంది. ముందుగా ఈ చిత్రాన్ని సీనియర్ దర్శకుడు బాల దర్శకత్వంలో తెరక్కెక్కించారు. సినిమా షూటింగ్ కూడా దాదాపుగా పూర్తయింది. అలాంటి సమయంలో దర్శకుడికి, నిర్మాతలకు తలెత్తిన విభేదాల కారణంగా బాల ఈ చిత్రం నుంచి తప్పుకున్నారు. 

కొత్త దర్శకుడు గిరిసాయ దర్శకత్వంలో సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభించారు. ఆదిత్య వర్మ పేరుతో ఈ చిత్రం తమిళంలో తెరక్కుతోంది. యంగ్ బ్యూటీ బనిత సందు హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఆదిత్య వర్మ చిత్ర టీజర్ ని రిలీజ్ చేశారు. ధృవ్ స్టైలిష్ గా కనిపిస్తూనే పెర్ఫామెన్స్ తో అదరగొట్టాడు. కథలో పెద్దగా మార్పులు చేసినట్లు కనిపించడం లేదు. 

త్వరలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. 4కె ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రధాన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. విక్రమ్ స్వయంగా తన కుమారుడి డెబ్యూ మూవీ గా అర్జున్ రెడ్డి రీమేక్ ని ఎంచుకున్నారు. ఆ చిత్రాన్ని తనని ఎంతగానో ఆకట్టుకుందని విక్రమ్ ఇది వరకే తెలిపారు.