ఈమే వెంకీ హీరోయిన్ అట.. మరి అనుష్క?

adithi rao hyderi as venkys heroine replaced anushka
Highlights

  • తేజ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విక్టరీ వెంకటేష్
  • ఈ మూవీ హిరోయిన్ గా కాజల్ కొన్నాళ్లు, అనుష్క పేరు కొన్నాళ్లు
  • తాజాగా అదితి రావ్ హైదరి వెంకీ హిరోయిన్ గా ఓకే అయినట్లు సమాచారం

విక్టరీ వెంకటేష్ హిరోగా తేజ దర్శకత్వంలో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవ్వకముందే చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నట్టుందన కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమా ఇటీవలే అఫీషియల్ గా లాంచ్ అయ్యింది. త్వరలో రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ కానుంది. కాస్ట్ అండ్ క్రూ వివరాలు దర్శకుడు ఇంకా చెప్పలేదు.


ఈ మూవీలో హీరోయిన్ గా ఎవరిని సెలెక్ట్ చేశారు అనే విషయంపై క్లారిటీ ఉండడం లేదు. మొదట తేజ కాజల్ నే సెలెక్ట్ చేశారు. కానీ ఆమె బిజీ షెడ్యూల్ వల్ల ఒప్పుకోలేదని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత తమన్నా అని మరో టాక్ వచ్చింది. ఆమె కూడా పలు కారణాల వల్ల తప్పుకుంది అనే రూమర్స్ బాగానే వచ్చాయి. ఇక ఫైనల్ గా లేడి సూపర్ స్టార్ అనుష్క ని ఒకే చేసినట్లు చిత్ర యూనిట్ వర్గాల నుండి న్యూస్ బాగానే వచ్చింది. కానీ ఇప్పుడు ఆమెను కాకుండా బాలీవుడ్ హీరోయిన్ ని వెంకటేష్ కి సెట్ చేసారని ప్రచారం జోరుగా సాగుతోంది.
 

బాలీవుడ్ లో అడపాదడపా సినిమాలతో ఓ స్థాయిలో మెప్పించిన అదితి రావ్ ని దర్శకనిర్మాతలు ఒకే చేసినట్లు సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమే తెలియదు గాని ఆ బ్యూటీ మాత్రం తెలుగులో అయితే ఒక సినిమాను స్టార్ట్ చేయడానికి రెడీ అయ్యింది. మోహన్ కృష్ణ ఇద్రగంటి - సుదీర్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న కొత్త ప్రాజెక్టులో అదితి రావ్ హీరోయిన్ గా నటిస్తోంది.

loader