గత కొన్నాళ్లుగా మీటూ పదం ఎంతగా వైరల్ అవుతుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. హాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎన్నో వివాదాలతో మీటూ ఎప్పుడు లేని విధంగా హాట్ టాపిక్ గా మారింది. లైంగిక వేధింపులను ఎదుర్కొన్నామని చెబుతున్న వారు గట్టిగా కుండ బద్దలుకొడుతుంటే మరికొందరు మాత్రం అసలు ఆ వేధింపులు ఇక్కడ లేవని డప్పు  కొడుతున్నారు. ఎవరిది నిజం అనేది క్లారిటీ రావడం లేదు గాని నిత్యం అనుమానాలు మాత్రం హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

రీసెంట్ గా అదితి రావ్ హైదరి కూడా మీటూ అంటూ తనకు జరిగిన చేదు అనుభవాన్ని బయటకు చెప్పుకుంది. ఇప్పుడిపుడే అవకాశాలను అందుకుంటూ ముందుకు సాగుతున్న ఈ బ్యూటీ ఒకానొక సమయంలో అడ్జస్ట్ అవ్వాలనే పరిస్థితి ఏర్పడినట్లు తెలిపింది. అడ్జస్ట్ అవుతావా లేకా అవకాశాన్ని వదులుకుంటావా అని డిమాండ్ చేశారట. అయితే అదితి ఏ మాత్రం బెదరకుండా అడ్జస్ట్ కాలేను అని ఒక కౌంటర్ ఇచ్చి వచ్చినట్లు తెలిపింది.

ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఉన్నాయని ఈ అంతరిక్షం బ్యూటీ తనదైన శైలిలో వివరణ ఇచ్చింది. అయితే సీనియర్ హీరోయిన్స్ మాత్రం అందుకు భిన్నంగా స్పందిస్తూ వస్తున్నారు. మొన్న రకుల్ నిన్న తమన్నా వంటి తారలు అసలు ఏనాడు అలాంటి అనుభవాలను ఇక్కడ ఎదుర్కోలేదని చెబుతూ వస్తున్నారు. దీంతో మీటూ ఎంతవరకు నిజం అనే సందేహం పలువురిలో భిన్న ఆలోచనలను కలిగిస్తోంది.