పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా 3డీ చిత్రం ‘ఆదిపురుష్‌’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్‌ దర్శకుడు ఓంరౌత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రతీ చిన్న అప్డేట్ కూడా అభిమానులను ఖుషీ చేస్తోంది.  రామాయాణం కథాంశంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా శ్రీరాముని పాత్రలో ప్రభాస్‌, రావణుని పాత్రలో సైఫ్‌అలీఖాన్ నటిస్తుండటం విశేషం. మొత్తం ఐదు భాషల్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి ఇటీవలే వీఎఫ్‌ఎక్స్‌ పనులను ప్రారంభించారు. టి-సిరీస్‌, రెట్రో పిల్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. 

ఆ మధ్యన బాహుబలి సినిమాలో కీలకమైన సీన్స్ అన్ని గ్రీన్ మ్యాట్ పై షూట్ చేసి తెరపై కన్నులపండగగా చూపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పదే పద్దతిని  ‘ఆదిపురుష్‌’ కొనసాగిస్తోంది. . దాదాపు 60శాతానికి పైగా షూటింగ్ ని ఈ గ్రీన్ మ్యాట్ సెట్స్ పైనే చిత్రీకరిస్తున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రీన్ మ్యాట్ లో వేసిన సెట్ లో 90 రోజులు పాటు షూట్ చేయనున్నారు.

 సీన్స్ అన్నీ ఇండోర్ లోనే షూట్ చేస్తారు కాబట్టి నో ప్లాబ్లం అంటున్నారు. ఇదే దర్శకుడు గతంలో తీసిన తానాజీ సినిమా కూడా ఇదే పద్దతిలో షూట్ చేసారు. దాదాపు 150 కేవలం విఎఫ్ ఎక్స్ మీదే ఖర్చు పెట్టనున్నారని తెలుస్తోంది. ఈ చిత్రానికి భూషణ్ కుమార్‌, కిషన్‌ కుమార్‌ నిర్మాతలు. రూ.500 కోట్ల బడ్జెట్ నిర్మితమవుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 11న తెరపైకి రానుంది. 
 

కొన్ని రోజుల కిందట ఈ సినిమా షూటింగ్‌ ముంబయిలో ప్రారంభమైంది. అక్కడ కొంతమేర షూటింగ్‌ పూర్తి చేసుకుంది. అయితే తాజాగా కరోనా వైరస్ రెండో దశతో మహారాష్ట్ర ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధిస్తోంది.. దీంతో వెండితెర, బుల్లితెరకు చెందిన షూటింగ్‌లు ఆగిపోయాయి. మరికొన్ని నెలల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉండటంతో చిత్ర బృందం హైదరాబాద్‌లో షూటింగ్‌ చేయాలని భావించి రామోజీ ఫిల్మ్ సిటీకు మకాం మార్చారట. 

  మరోవైపు ప్రభాస్‌ ‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వంలో ‘సలార్‌’మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. శృతిహాసన్‌ ప్రభాస్‌ సరసన నటిస్తున్నారు. ఇటీవలే గోదావరి ఖని ఓపెన్‌కాస్ట్‌లో షూటింగ్‌ కూడా మొదలపెట్టారు. ఆ షూట్‌లో లీకైన కొన్ని ప్రభాస్‌ ఫొటోలు అంతర్జాలంలో వైరల్‌గా మారాయి.