దళితులకు `ఆదిపురుష్` థియేటర్లలోకి ప్రవేశం లేదు.. ఘాటుగా స్పందించిన టీమ్
`ఆదిపురుష్` హంగామా ఓ వైపు పీక్‌లోకి వెళ్తున్న నేపథ్యంలో అదే సమయంలో నెగటివిటీ కూడా స్ప్రెడ్ అవుతుంది. కొందరు పనిగట్టుకుని ఫేక్ వార్తలను సృష్టిస్తున్నారు. తాజాగా `ఆదిపురుష్`పై ఫేక్ వార్తలను క్రియేట్ చేశారు.

ప్రస్తుతం తెలుగులోనే కాదు, ఇండియా వైడ్‌గా `ఆదిపురుష్` మానియా కొనసాగుతుంది. నిన్న(మంగళవారం) సాయంత్రం తిరుపతిలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో ఆ మానియా, హైప్ మరింతగా పెరిగింది. ఇది సినిమా ప్రీరిలీజ్ బిజినెస్‌పై చాలా ప్రభావాన్ని చూపుతుంది. ఎక్కడ చూసినా `జై శ్రీరామ్` నినాదాలు హోరెత్తుతున్నాయి. ప్రభాస్‌ని రాముడిగానే చూస్తున్నారు అభిమానులు. రాముడే అసలైన బాహుబలి అని చిన్న జీయర్ స్వామి నిన్న ఈవెంట్‌లో చెప్పడం మరింత హైలైట్ గా నిలిచింది. రాముడి మార్గం మనుషులకు ఆదర్శమని, మంచి మనిషి కోసం దేవుడే దిగి వస్తాడని ఆయన వెల్లడించారు.
ఇలా `ఆదిపురుష్` హంగామా ఓ వైపు పీక్‌లోకి వెళ్తున్న నేపథ్యంలో అదే సమయంలో నెగటివిటీ కూడా స్ప్రెడ్ అవుతుంది. కొందరు పనిగట్టుకుని ఫేక్ వార్తలను సృష్టిస్తున్నారు. తాజాగా `ఆదిపురుష్`పై ఫేక్ వార్తలను క్రియేట్ చేశారు. దీనికి మతానికి, కులాలకు ముడిపెట్టారు. `ఆదిపురుష్` ప్రదర్శించే థియేటర్లలోకి దళితులకు అనుమతి లేదనే ఈ పోస్ట్ సారాంశం. `రామాయణ పారాయణం జరిగే చోట పవిత్రంగా ఉండాలనేది మా నమ్మకం, ఈ నమ్మకాన్ని గౌరవిస్తూ, ప్రభాస్ రాముడిగా నటించిన ఆదిపురుష్ సినిమా ప్రదర్శించే థియేటర్లలో దళితులకు ప్రవేశం లేదు. ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ స్థాయిలో ధర్మం కోసం నిర్మించిన ఈ సినిమాని హిందువులు అందరు తప్పకుండా వీక్షించాలి` అని ఈ పోస్ట్ లో రాసి ఉంది. దీన్ని యూవీ క్రియేషన్స్, పీపుల్స్ మీడియాఫ్యాక్టరీ, `ఆదిపురుష్` టీమ్ వెల్లడించినట్టుగా పోస్ట్ ని క్రియేట్ చేశారు.
ఈ పోస్ట్ కాస్త `ఆదిపురుష్` టీమ్ వద్దకు వెళ్లింది. దీనిపై టీమ్ గట్టిగా స్పందించింది. ఇది ఫేక్ న్యూస్ అని, ఇలాంటివి వాటిని నమ్మవద్దని వెల్లడించింది. `ఆదిపురుష్` చిత్రం పేరుతో చేసిన ఈ ప్రకటన తప్పుదారి పట్టించేదిగా ఉంది. `ఆదిపురుష్` టీమ్ కుల, వర్ణ, మతం ఆధారంగా ఎలాంటి వివక్షను చూపకుండా సమానత్వం కోసం దృఢంగా నిలుస్తుంది. ఈ చెడును ఎదురించే క్రమంలో మాకు సహయం చేయాలని కోరింది. `ఆదిపురుష్` ప్రతి భారతీయుడిది అని, చెడుపై మంచి గెలుస్తుందని వెల్లడించింది టీమ్.
ప్రభాస్, కృతి సనన్ జంటగా ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం `ఆదిపురుష్`. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్ నటిస్తుంది. టీ సిరీష్, యూవీ క్రియేషన్స్ నిర్మించాయి. తెలుగులో ఈ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ రిలీజ్ చేస్తుంది. సుమారు ఐదు వందల కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా జూన్ 16న భారీగా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరిగింది. మరి సినిమా ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.