సారాంశం
ప్రీ రిలీజ్ ఈవెంట్ పై చిత్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన యూవీ క్రియేషన్స్ అధికారికంగా ప్రకటించింది.శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ గ్రౌండ్స్ లో ఆది పురుష యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చేస్తున్నారు. ఏడుకొండల వాడి సాక్షిగా ఆది పురుష ఫ్రీ రిలీజ్ జోరు మొదలవుతుంది.
ప్రభాస్ నటించిన మైథలాజికల్ మూవీ ఆది పురుష్ ప్రపంచవ్యాప్తంగా జూన్ 16న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. రామాయణం ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించిన ఈ సినిమాలో రాముడుగా ప్రభాస్, కృతిసనన్ సీతగా కనిపించనుంది. ఈ మూవీ ట్రైలర్ ను ఇటీవలే రిలీజ్ చేయగా...మంచి రెస్పాన్స్ దక్కించుకొని సినిమా పై అన్ని వర్గాల ప్రేక్షకుల్లో అంచనాలు క్రియేట్ చేసుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాతలు జూలై 6 న అంటే ఈ రోజు సాయింత్రం 5 గంటలకు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముహూర్తాన్ని ఖరారు చేశారు.
దీనికి ఎస్ఎస్. రాజమౌళి చీఫ్ గెస్ట్ గా హాజరు కానున్నారని గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఈ ఈవెంట్ కు చిన జీయర్ స్వామీజి గెస్ట్ గా రాబోతున్నారు. అంతేకాకుండా చిన జీయర్ భక్తులు కూడా చాలా మంది ఈ ఈవెంట్ కు హాజరుకానున్నారని, ఇప్పటికే ఆయన్ని అనుసరించేవారందరికీ ఈ వార్త వెళ్లినట్లు సమాచారం. అలాగే చాలా మంది భక్తులుకు తిరుపతికు ఈ ఈవెంట్ కు హాజరుకావటానికి టిక్కెట్లు కూడా ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. ప్రభాస్ అభిమానులు సరే సరి... ఓ మహాసముద్రంలా తిరుపతి ఈ భక్తులు,అభిమానులతో నిండిపోనుంది.
తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ పై చిత్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన యూవీ క్రియేషన్స్ అధికారికంగా ప్రకటించింది.శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ గ్రౌండ్స్ లో ఆది పురుష యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చేస్తున్నారు. ఏడుకొండల వాడి సాక్షిగా ఆది పురుష ఫ్రీ రిలీజ్ జోరు మొదలవుతుంది. ఈవెంట్ కు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తైనట్లు సమాచారం.
ఆదిపురుష్ ప్రీరిలీజ్ ఈవెంట్ భారీ ఎత్తున నిర్వహించబోతున్నారు. ఈ వేడుకలో దాదాపు 200 మంది సింగర్స్, 200 మంది డ్యాన్సర్స్ ప్రదర్శన ఇవ్వబోతున్నట్లుగా సమాచారం. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే కనివినీ ఎరుగని రీతిలో ఈ వేడుక ఉండనుందట.
ఆదిపురుష్ ప్రీరిలీజ్ ఈవెంట్ ను తిరుపతి లో నిర్వహిస్తున్నారు.ఎందుకంటే బాహుబలి ది బిగినింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతి ఎస్వీ గ్రౌండ్స్ లోనే జరిపారు. ఆ సినిమా బంపర్ హిట్టయింది. అదే సెంటిమెంట్ ని ఫాలో చేస్తూ ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. అలాగే ఈ ఈవెంట్ కు జక్కన్న వస్తారా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంది. ఇప్పటికే సాహో, రాధశ్యామ్ సినిమాలతో వరుస ప్లాపులతో సతమతమవుతున్న ప్రభాస్ కి ఆది పురుష్ సినిమా అయినా సూపర్ సక్సెస్ ని అందిస్తుందో లేదో చూడాలి మరి.