పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ భారీ చిత్రం ఏదన్నా ఉంది అంటే అది “ఆదిపురుష్” అని అందరికీ తెలిసిందే
ఓ పెద్ద సినిమా రిలీజ్ అవుతోందంటే..ఖచ్చితంగా ఆ సినిమా ఓటిటిలో ఎప్పుడు వస్తోందనే ఎంక్వైరీలు మొదలైపోతున్నాయి. అందుకు కారణం ..అందరూ థియోటర్ కు వెళ్లాలేకపోవటం, అందుకు తగ్గ సమయం కేటాయించలేకపోవటం, ఫ్యామిలీ మొత్తం సినిమా కు వెళ్లాలంటే టిక్కెట్ రేట్లు సమస్యగా మారటం వంటివి. అయితే ఇంతకు ముందు ఈ సమస్య లు ఉన్నా వేరే దారి ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఓటిటిలు వచ్చాక...అఫీషియల్ గా ఒరిజనల్ ప్రింట్ ని ఫ్యామిలీ మొత్తం తమ ఇంట్లో కూర్చుని చూసే అవకాసం దొరుకుతోంది. చాలా సినిమాలు రిలీజైన పదిహేను రోజులకే, నెల లోపలే, మరికొన్ని వారంలోగానే ఓటిటిలలో ప్రత్యక్ష్యమైపోతున్నాయి. ఈ నేపధ్యంలో ఆదిపురుష్ సినిమాని ఓటిటిలో చూద్దామని వెయిట్ చేస్తున్నవారికి టీమ్ చేదు వార్తే చెప్పింది.
ఆది పురుష్ ఓటిటి విషయమై అఫీషీయిల్ గా టీమ్ స్పందించింది. ఖచ్చితంగా ఆదిపురుష్ ని థియేటర్స్ లోనే ఎక్స్ పీరియన్స్ చెయ్యండి. ఎందుకంటే ఆదిపురుష్ మూవీ ని థియేటర్స్ లో చూస్తేనే ఆ కిక్ ఉంటుంది. అందులోను త్వరగా ఓటిటిలోకి వచ్చేస్తుంది భావించవద్దు ఆదిపురుష్ ఎనిమిది వారాల తర్వాతే అంటే ఆగష్టు సెకండ్ వీక్ లోకి ఓటిటిలోకి వస్తుంది అంటూ మేకర్స్ తాజాగా ప్రకటించారు.
ప్రభాస్ ఆదిపురుష్ హంగామా నేడు జూన్ 14 న టికెట్ బుకింగ్ ఓపెన్ అవడంతో షురూ అయ్యింది. తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చూసాక ఆదిపురుష్ క్రేజ్ ఎంతెలా ఉందో అర్ధమైంది. టీజర్ నెగిటివిటి మొత్తం పోయి సినిమా చుట్టూ పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చేసాయి. దానితో అదే స్థాయిలో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. అయితే ఆదిపురుష్ మేకర్స్ జూన్ 16 న సినిమా థియేటర్స్ లో విడుదలవుతుంది.
ఆదిపురుష్ ని అప్పటివరకు థియేటర్స్ లోనే చూసి ఎంజాయ్ చెయ్యాలి. ఇక ఈ చిత్రంలో కృతి సనన్, సైఫ్ అలీఖాన్, సన్నీ సింగ్ సహా సోనాల్ చౌహన్ తదితరులు కీలక పాత్రల్లో నటించగా అజయ్ మరియు అతుల్ లు సంగీతం అందించారు. అలాగే టి సిరీస్ భూషణ్ కుమార్, ఓంరౌత్ లు అయితే ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు.