యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రం టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద దుసుకుపోతోంది. ఆదిపురుష్ చిత్రాన్ని రిలీజ్ కి ముందే అనేక వివాదాలు చుట్టుముట్టాయి.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రం టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద దుసుకుపోతోంది. ఆదిపురుష్ చిత్రాన్ని రిలీజ్ కి ముందే అనేక వివాదాలు చుట్టుముట్టాయి. రిలీజ్ తర్వాత విమర్శలు, ట్రోలింగ్, సమస్యలు మరింత ఎక్కువయ్యాయి. కానీ ప్రభాస్ క్రేజ్, రామాయణం బ్యాక్ డ్రాప్ కావడంతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్ర జోరు తగ్గడం లేదు. 

ప్రభాస్ శ్రీరాముడిగా వెండితెరపై అదరహో అనిపించాడు. ఓం రౌత్ కాస్త జాగ్రత్తలు తీసుకుని భారతీయ సంస్కృతికి తగ్గట్లుగా ఒరిజినల్ రామాయణం ఆధారంగా పాత్రలు, గ్రాఫిక్స్ విషయంలో జాగ్రత్త తీసుకుని ఉంటే బాక్సాఫీస్ సునామి ఇంకాస్త ఎక్కువ ఉండేది. మిక్స్డ్ టాక్ లో కూడా ప్రభాస్ చిత్రం 300 కోట్ల మార్క్ అధికమించింది. 3 రోజుల్లోనే ప్రభాస్ చిత్రం ఈ ఫీట్ అందుకుంది. 

వరల్డ్ వైడ్ గా ఫస్ట్ వీకెండ్ లో ఆదిపురుష్ చిత్రం కాసుల వర్షం కురిపిస్తూ 302 కోట్ల గ్రాస్ రాబట్టింది. అంటే వరల్డ్ వైడ్ షేర్ 151 కోట్లు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఆదిపురుష్ చిత్రం మూడు రోజుల్లో 64 కోట్ల షేర్ అందుకుంది. నైజాం లో ఈ చిత్రం మూడు రోజుల్లో దాదాపు 30 కోట్ల షేర్ సాధించింది. అక్కడ బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 20 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది. 

సీడెడ్ లో 7.5 కోట్లు, ఉత్తరాంధ్రలో 8.3 కోట్లు, ఈస్ట్ వెస్ట్ కలిపి 8.2 కోట్లు కృష్ణ లో 3.3, గుంటూరులో 5.8 కోట్ల షేర్ రాబట్టడం విశేషం. ఇక హిందీలో ఈ చిత్రం 100 కోట్ల గ్రాస్ రాబట్టింది. వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే మరో 90 కోట్ల పైనే షేర్ రాబట్టాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నేటి నుంచి వీక్ డేస్ మొదలవుతాయి. ఆదిపురుష్ కి సోమవారం నుంచి అసలైన పరీక్ష మొదలు కానుంది. ఇదే ట్రెండ్ కొనసాగితే బ్రేక్ ఈవెన్ సాధించడం కష్టం కాకపోవచ్చు. కానీ సోమవారం డ్రాప్ ఎలా ఉంటుందనేది ఆసక్తిగా మారింది. 

ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రభాస్ శ్రీరాముడిగా, కృతి సనన్ జానకిగా,సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా నటించారు. టీజర్ నుంచి మొదలైన వివాదాలు రిలీజ్ తర్వాత కూడా కొనసాగాయి.