ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీలో ఎప్పుడూ.. ఏ సినిమాకు లేని ప్రత్యేకత.. ఈసారి ప్రభాస్ ఆదిపురుష్ కు సంతరించుకుంది. ఒకటి కాదు రెండు కాదు.. ఈసినిమాకు సబంధించి విశేషాలెన్నో.. ప్రత్యేకతలెన్నో.. ముఖ్యంగా సినిమా టికెట్ల విషయంలో.. అద్భుతాలే జరుగుతున్నాయి.
గ్లోబల్ ఇమేజ్ తో దూసుకుపోతున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాముడిగా.. బాలీవుడ్ బ్యూటీ కృతీ సనన్ సీతగా నటించిన ప్రతిష్టాత్మక సినిమా ఆదిపురుష్. రావణాసురిడి పాత్రలో సైఫ్ అలీఖాన్ నటించగా.. ఇతర పాత్రల్లో స్టార్ కాస్ట్ సందడి చేయబోతోంది. ఈసినిమాలో ప్రత్యేకతలెన్నో.. మొట్టమొదటి సారి ఈసినిమా కోసం.. ప్రీరిలీజ్ వేడుకకు జీయర్ స్వామి ముఖ్య అతిథిగా వచ్చారు. ఇక ఈమూవీలో ప్రభాస్ మొదటి సారి రాముడిగా కనిపించబోతున్నారు. అంతే కాదు ఈసినిమా టికెట్లు కూడా ప్రత్యేకం అవుతున్నాయి.
ముఖ్యంగా ఆదిపురుష్ టీమ్.. ప్రతీ సినిమా హాల్ లో .. హనుమంతుని కోసం ఓ సీట్ ఖాళీగా ఉంచబోతున్నారు. రామ నామ స్మరణ జరిగే ప్రతీ చోట హనుమ ఉంటాడన్న నినాదంతో.. ప్రతీ హాల్ లో ఆంజనేయుడికోసం ఓ సీట్ రిజర్వ్ చేశారు. ఇక ఆతరువాత ఈసినిమాను పేదవారు చూడాలి అనే ఆరటంతో.. పేద పిల్లల కోసం బాలీవుడ్ యంగ్ హీరో రణ్ బీర్ కపూర్.. 10 వేల టికెట్లకు పైగా బుక్ చేశారు. పేద పిల్లకు ఈసినిమా చూపించబోతున్నారు. ఇక మన టాలీవుడ్ స్టార్ హీరో.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా పేద వారికోసం ఆదిపురుష్ 10 వేల టికెట్లు బుక్ చేశారు.
ఇక ఇదంతా ఒక ఎత్తయితే.. ఇప్పుడు మరో కార్యక్రమంతో జనాలను ఆకట్టుకోబోతున్నారు. ఇటువంటి మంచి కార్యక్రమంలో శ్రేయాస్ మీడియా కూడా పాలుపంచుకోనుంది. ఇందులో భాగంగా ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రతి రామాలయానికి 101 టిక్కెట్లు ఉచితంగా ఇవ్వనున్నట్లు శ్రేయాస్ మీడియా అధినేత గండ్ర శ్రీనివాస్ రావు తెలిపారు. టిక్కెట్లు కావాల్సిన వారు తమను సంప్రదించాలని సోషల్ మీడియా వేదికగా కోరారు. ఖమ్మం జిల్లాలో భద్రాద్రిరాముడు కోలువై ఉండటంతో.. ఈ జిల్లాకు మాత్రమే ఈ అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది.
భూషణ్ కుమార్, క్రిష్ణకుమార్, ఓమ్ రౌత్, ప్రసాద్ సుతారియా, రెట్రోఫిల్స్ రాజేష్ నాయర్, యూవీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్ సుమారు రూ.500 కోట్ల బడ్జెట్‌తో ఆదిపురుష్‌ను నిర్మించారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ మైథలాజికల్ మూవీ ఈనెల 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ భారీ ఎత్తున ప్రభాస్ రిలీజ్ చేస్తోంది.
