శుక్రవారం రోజు ఆదిపురుష్ వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయింది. అభిమానుల ఆశలన్నీ నీరుగారిపోయాయి. కార్టూన్ గ్రాఫిక్స్ చిత్రం అంటూ సోషల్ మీడియాలో విమర్శలు, ట్రోలింగ్ జరుగుతోంది.
శుక్రవారం రోజు ఆదిపురుష్ వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయింది. అభిమానుల ఆశలన్నీ నీరుగారిపోయాయి. కార్టూన్ గ్రాఫిక్స్ చిత్రం అంటూ సోషల్ మీడియాలో విమర్శలు, ట్రోలింగ్ జరుగుతోంది. దర్శకుడు ఓం రౌత్ మన సంస్కృతిని పక్కన పెట్టి హర్రర్ మూవీలా రామాయణాన్ని మార్చేసినట్లు దుమ్మెత్తిపోస్తు
రాబోవు రోజుల్లో ఆదిపురుష్ చిత్రాన్ని ప్రభాస్ క్రేజ్ ఏమేరకు నిలబెడుతుందనేది అనుమానమే. ఆదిపురుష్ చిత్రం దాదాపు 500 కోట్ల బడ్జెట్ లో నిర్మించారు. ప్రస్తుతం ఉన్న టాక్ ని అధికమించి పెట్టుబడి మొత్తం రికవరీ చేయడం ఏమేరకు సాధ్యం అవుతుందో చూడాలి. ఈ క్రమంలో ఆదిపురుష్ మేకర్స్ డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారా.. అది కూడా రాంగ్ వేలో.. తాజాగా ఆదిపురుష్ మేకర్స్ పై సంచలన ఆరోపణలు చేస్తూ కొందరు ట్విట్టర్ పీపుల్ షాకింగ్ పోస్ట్ లు పెడుతున్నారు.
డాక్టర్ నిమో యాదవ్ అనే వ్యక్తి ట్విట్టర్ లో చేసిన ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. అతడికి ట్విట్టర్ లో 50 వేలకి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఆదిపురుష్ చిత్రంపై నెగిటివ్ ట్వీట్స్ డిలీట్ చేసి పాజిటివ్ ట్వీట్స్ పెడితే డబ్బు ఇస్తామని అతడికి కొందరు అపరిచితుల నుంచి మెసేజ్ లు వచ్చినట్లు స్క్రీన్ షాట్స్ పోస్ట్ చేశాడు. ఒక్కో పోస్ట్ కి రూ 9500 ఇస్తామమని ఆఫర్ చేయడం ఆ మెసేజ్ లో ఉంది.
'హలో డాక్టర్ నిమో యాదవ్, మీకు ఓకేఅర్జెంటు రిక్వస్ట్.. ఆదిపురుష్ పై నెగిటివ్ ట్వీట్స్ డిలీట్ చేసి పాజిటివ్ పోస్ట్ లు పెట్టండి. ఒక్కో పోస్ట్ కి రూ 9500 ఇస్తాం. వెంటనే ఆ పని చేసి మాకు తెలియజేయండి డబ్బు వస్తుంది' అనే మెసేజ్ ని అతడు తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.
ఇదే విధంగా మరో ట్విట్టర్ యూజర్ కి కూడానా డీల్ వెళ్ళింది. రోషన్ రాయి అనే యూజర్ కి ట్విట్టర్ లో 11 వేలమంది ఫాలోవర్స్ ఉన్నారు. టి సిరీస్ సంస్థకి చెందిన కొందరు నాకు ఆదిపురుష్ పై నెగిటివ్ ట్వీట్స్ డిలీట్ చేయమని పాజిటివ్ ట్వీట్స్ పెట్టమని డీల్ ఇస్తున్నారు. నాకు మెసేజ్ చేస్తున్నారు. రూ.5500 ఆఫర్ చేశారు. కానీ వాళ్ళు రాంగ్ పర్సన్ ని ఎంచుకున్నారు అంటూ పోస్ట్ పెట్టాడు.
వాళ్ళకి డైరెక్ట్ గా రిప్లై ఇచ్చిన స్క్రీన్ షాట్ ని కూడా పోస్ట్ చేశాడు. మీరు 5500 కాదు 5 లక్షలు ఇచ్చినా నేను నా ట్వీట్స్ డిలీట్ చేయను. ఆదిపురుష్ డిజాస్టర్ అంటూ పోస్ట్ పెట్టాడు. చూస్తుంటే ఇది ఆదిపురుష్ మేకర్స్ మరో పెద్ద వివాదంలో చిక్కుకున్నట్లే ఉంది. ఆల్రెడీ ఆదిపురుష్ లో డైలాగ్స్, రాముడి గెటప్, రావణుడి పాత్ర పై తీవ్ర వివాదం అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఢిల్లీలో కేసులు కూడా నమోదవుతున్నాయి.
దర్శకుడు ఓం రౌత్ చాలా అంశాలు రామాయణం చరిత్రని పట్టించుకోకుండా తన సొంత ఆలోచనలతో సినిమాని చెడగొట్టాడు అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రామాయణాన్ని మోడ్రనైజ్ చేయాలనుకుని కార్టూన్ గ్రాఫిక్స్ క్రియేట్ చేసినట్లు ట్రోల్ చేస్తున్నారు. అయితే ఈ ట్వీట్స్ వివాదం పై చిత్ర యూనిట్ స్పందించాల్సి ఉంది. అయితే ఆదిపురుష్ చిత్రాన్ని ఇలా మేకర్స్ పేరుతో ఎవరైనా టార్గెట్ చేస్తున్నారా.. డబ్బు ఆఫర్ చేసింది నిజమా కాదా అనేది తెలియాల్సి ఉంది. ఈ రకమైన ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి.
