‘జై శ్రీరామ్ జై శ్రీరామ్ రాజా రామ్’.. హృదయాలు ఉప్పొంగేలా ‘ఆదిపురుష్’ మొదటి పాట

‘ఆదిపురుష్’ నుంచి మరింత హైప్ పెంచేలా మొదటి పాట విడుదలైంది. ‘జై శ్రీరామ్’ సాంగ్ కోసం ఎదురుచూస్తున్న సంగీత ప్రియులకు ఇది అద్భుతమైన సాంగ్ అనిపిస్తుంది. హృదయాలు ఉప్పొంగేలా సాహిత్యం అందించారు. 
 

Adipurush First Single Jai Shri Ram full song Out NSK

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ (PRabhas) రాముడుగా, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ (Kriti Sanon) సీతగా నటించిన సినిమా ‘ఆదిపురుష్‌’.  ఓం రౌత్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ కు అద్భుతమైన స్పందన లభించిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి అందుతున్న ప్రతి అప్డేట్ కి సినిమాపై భారీ అంచనాలు కూడా ఏర్పడుతూ వస్తున్నాయి. ఇక తాజాగా ఈ చిత్రం నుంచి ‘జై శ్రీరామ్ జై శ్రీరామ్‘ (Jai Shree Ram) అనే గీతాన్ని విడుదల చేశారు. 

డివోషనల్ సాంగ్స్ చేయడంలో ది బెస్ట్ అనిపించుకున్న అజయ్ - అతుల్ స్వరపరిచిన ఈ గీతానికి ప్రముఖ లిరిసిస్ట్ రామ జోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. ‘జై శ్రీరామ్ జై శ్రీరామ్ రాజా రామ్ .. నీ సాయం సదా మేమున్నాం.. సిద్ధం సర్వసైన్యం.. సహచరులై సహా వస్తున్నాం.. సకలం స్వామి కార్యం.. మహిమాన్విత మంత్రం నీ నామం’.. అంటూ సాగే ఈ గీతాన్ని అద్భుతమైన ట్యూన్ తో స్వరపరిచారు అజయ్ - అతుల్ ద్వయం. ఒక్కో బీట్ హృదయాలు ఉప్పొంగేలా కనిపిస్తోంది. రావణుడితో యుద్ధానికి సన్నద్ధం అవుతున్న సందర్భంలో వచ్చే గీతంలా కనిపిస్తోందీ పాట. రామ జోగయ్య శాస్త్రి రచన ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునే సాహిత్యంతో సింపుల్ గా ఉన్నా.. బలమైన పదజాలం కనిపిస్తోంది. 

పాటలో వాడిన ఇన్ స్ట్రుమెంట్స్ లో డ్రమ్స్ మోతకు థియేటర్స్ దద్దరిల్లేలా కనిపిస్తోంది. ట్రైలర్ తర్వాత హై ఎక్స్ పెక్టేషన్స్ తెచ్చుకున్న ఆదిపురుష్ లోని ఈ గీతం ప్రేక్షకులకు భక్తితో కూడిన ఒక రకమైన పూనకం తెప్పించేలా ఉంది. 2023లో మోస్ట్ అవెయిటెడ్ మూవీగా ఉన్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. గతేడాదే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం వీఎఫ్ఎక్స్, సీజీ వర్క్ లో మరింత నాణ్యత కోసం వాయిదా వేశారు. పలు విమర్శల తర్వాత మళ్లీ హైప్ క్రియేట్ అవుతోంది. ఇక ఎట్టకేళకు వచ్చే నెలలో 16న విడుదల సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా యూనిట్ ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహిస్తున్నారు.

చిత్రంలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ రావణసురుడి పాత్రను పోషించిన విషయం తెలిసిందే. సన్నీ సింగ్, దేవదత్త నాగే, వత్సల్ సేన్, సోనాల్ చౌహాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. టీ సిరీస్, రెట్రోఫిల్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి భూషణ్ కుమార్, క్రిష్ణకుమార్, ఓమ్ రౌత్, ప్రసాద్ సుతారియా, రాజేష్‌ నాయర్, వంశీ, ప్రమోద్ నిర్మాతలుగా వ్యవహరించారు. అపూర్వ మోతీవాలే సాహై, ఆశిష్‌ మాత్రే ఎడిటర్లు. కార్తీక్ పల్నాని డీవోపీగా బాధ్యతలు చూశారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios