సారాంశం
`ఆదిపురుష్` సినిమా నుంచి మరో ట్రైలర్ రిలీజ్ అయ్యింది. `ఆదిపురుష్` ఫైనల్ ట్రైలర్ పేరుతో దీన్ని రిలీజ్ చేశారు. యుద్ధ సన్నివేశాలు, భావోద్వేగ సన్నివేశాలతో ఈ ట్రైలర్ సాగింది. కానీ..
ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్టాత్మక మూవీ `ఆదిపురుష్` మేనియా సాగుతుంది. ఈ రోజు తిరుపతిలో జరుగుతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ సినిమాపై అంచనాలను, హైప్‌ని అమాంతం పెంచేసింది. అయితే ఫ్యాన్స్ కి సర్‌ప్రైజింగ్ ట్రీట్ ఇచ్చింది యూనిట్. ఫైనల్ ట్రైలర్‌ని విడుదల చేసింది. యుద్ధ సన్నివేశాల నేపథ్యంలో సాగే ఈ ట్రైలర్ ఆద్యంతం ఎమోషనల్‌గా, యుద్ధ సన్నివేశాలతో ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. యాక్షన్ సీన్లు అదరగొడుతున్నాయి.
రావణుడు సీతని ఎత్తుకెళ్లిన నేపథ్యంలో సీత కోసం రాముడు సన్నద్దమవడం, తన సేనని, వానర సేని యుద్ధానికి పురికోల్పడం, ఈ క్రమంలో వారిలో పోరాటతత్వాన్ని నింపడం, అనంతరం రావణుడి సేనతో యుద్ధంలో చేయడం వంటి సన్నివేశాలు ఈ ట్రైలర్‌లో చూపించారు. దీంతోపాటు ఎమోషనల్ డైలాగ్‌లో ట్రైలర్‌ని హైలైట్‌గా నిలిచాయి.
సీతని రావణుడు ఎత్తుకెళ్లిన నేపథ్యంలో .. రాముడు.. `వస్తున్నా రావణా.. న్యాయం రెండు పాదాలతోని పది తలల అన్యాయాన్ని అణచివేయడానికి. వస్తున్నా నా జానకిని తీసుకెళ్లడానికి, ఆగమనం. ఆధర్మ విధ్వంసం`, `కానీ ఈ రోజు నాకోసం పోరాడొద్దు. భరతఖండంలోని స్త్రీలపై చేయి వేయాలని చూసే దుష్టులకి మీ పౌరుష పరాక్రమాలు గుర్తొచ్చి వెన్నుల్లో వణుకుపుట్టాలి. పోరాడతారా? అయితే దూకండి ముందుకు, ఆహాంకార రొమ్ము చీల్చి ఎగురుతున్న విజయ ధ్వజాన్ని పాతండి` అని రాముడిగా ప్రభాస్ చెప్పే డైలాగులు ఆద్యంతం ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి.
అనంతరం హనుమంతుడు `మీరు నాతో వచ్చేయండమ్మా` అని సీతని అడగ్గా, `ఆ గుమ్మంలోకి వచ్చేది రాఘవ తీసుకు వెళ్లినప్పుడే` అనే డైలాగ్‌తోపాటు చివరగా ప్రభాస్ చెప్పే.. నేను వీక్షాకు వంశోద్భావ రాఘవ. మీపై బ్రహ్మాస్త్ర ప్రయోగానికి వివశ్యుడినై ఉన్నాను` అని చెప్పడం ఆ ఎమోషన్‌ని పీక్‌లోకి తీసుకెళ్లింది. చివరగా రావణాసుడు.. `ఈ దశకంఠుడు పది మంది రాఘవుల కంటే ఎక్కువ` అనగా, `పాపం ఎంత బలమైనదైనా, అంతిమ విజయం సత్యానిదే` అని రాముడు ఫినిషింగ్ టచ్ ఇవ్వడం విశేషం.
ఆద్యంతం యుద్ధ సన్నివేశాలు, ఉత్తేజపరిచే డైలాగులతో ఈ ట్రైలర్ సాగింది. దర్శకుడు చాలా వరకు భావోద్వేగాలకు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. ఆ విషయంలో సక్సెస్ అయ్యాడు. కానీ విజువల్స్ పరంగా మళ్లీ దొరికిపోయారు. రాముడు, సీత, హనుమంతుడు, రావణాసురుడు వంటి పాత్రల్లో రియాలిటీ కనిపిస్తుంది. కానీ మిగిలిన వానర సేన, ఇతర పాత్రల్లో మాత్రం సహజత్వం మిస్ అయ్యింది. వీఎఫ్‌ఎక్స్ దొరికిపోయేలా ఉన్నాయి. ఆయా సీన్లు చూస్తుంటూ మరోసారి కార్టూన్‌ని తలపిస్తుండటం విశేషం. ఇదే అభిప్రాయం నెటిజన్ల నుంచి వ్యక్తమవుతుంది. విజువల్స్ విషయంలో రియాలిటీ మిస్ అయ్యింది. మరి ఈ ప్రభావం సినిమాపై ఎంత మేర ఉంటుందో చూడాలి. కానీ ట్రైలర్‌లో ఉన్నంత సహజత్వం ఇందులో మిస్ కావడం గమనార్హం.