కెరీర్ లో మొదటిసారి ప్రభాస్ పౌరాణిక పాత్ర చేస్తున్నారు. ఆదిపురుష్(Adipurush) రామాయణ గాథగా తెరకెక్కుతుంది. కాగా ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర విషయాలు వెల్లడించారు దర్శకుడు ఓం రౌత్.  

ఐదు భాషల్లో వరల్డ్ వైడ్ గా ఆదిపురుష్ విడుదల కానుంది. లేటెస్ట్ మీడియా ఇంటరాక్షన్ లో దర్శకుడు ఓం రౌత్(Om Raut) ఆదిపురుష్ మూవీ గురించి మాట్లాడుతూ.. నిజానికి ఆదిపురుష్‌ ఆలోచన ఓ జపనీస్‌ కథ నుంచి పుట్టింది. జపనీస్‌లో తెరకెక్కిన 'ఏ ప్రిన్స్‌ ఆఫ్‌ లైట్‌' అనే సినిమా చూశా. నాకు బాగా నచ్చింది. ఆ స్ఫూర్తితోనే ఆదిపురుష్‌ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాం. ఈ చిత్రంలో ప్రభాస్‌ రాఘవగా, కృతి సనన్‌ జానకిగా, సైఫ్‌ అలీఖాన్‌ లంకేష్‌గా కనిపించబోతున్నారు. ఆదిపురుష్‌గా ప్రభాస్‌ ని తప్ప మరొకర్ని ఊహించలేదు. ఆయన మాత్రమే ఈ చిత్రానికి న్యాయం చేయగలరు. అందుకే ప్రభాస్‌ని సంప్రదించాం అని చెప్పుకొచ్చారు. 

ప్రముఖ బాలీవుడ్ సంస్థ టీ సిరీస్‌దాదాపు రూ. 400 కోట్ల బడ్జెట్ తో ఆదిపురుష్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమా మొత్తం సెట్స్ లోనే పూర్తి చేశారు. సినిమా అధిక భాగం గ్రాఫిక్స్ తో రూపొందించనున్నారు. ప్రభాస్-సైఫ్ అలీ ఖాన్ మధ్య వచ్చే పోరాట సన్నివేశాలు అబ్బుర పరచనున్నారు. ఆదిపురుష్ చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) వరుసగా బడా చిత్రాలు చేస్తున్నారు. ఆయన లేటెస్ట్ మూవీ రాధే శ్యామ్ రూ. 300 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కించారు. పీరియాడిక్ ఎమోషనల్ లవ్ డ్రామాగా రాధే శ్యామ్ తెరకెక్కుతుంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న రాధే శ్యామ్ మార్చ్ 11న గ్రాండ్ గా విడుదల కానుంది. అనంతరం ప్రభాస్ నుండి సలార్ విడుదల కానుంది. కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్ తో సలార్ తెరకెక్కుతుంది. సలార్ మూవీలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. సలార్ చాలా వరకు చిత్రీకరణ జరుపుకుంది. 

ఇక దర్శకుడు నాగ్ అశ్విన్ తో చేస్తున్న ప్రాజెక్ట్ కే చిత్రీకరణ ఇటీవల మొదలైంది. రామోజీ ఫిల్మ్ సిటీలో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన సెట్స్ లో ప్రాజెక్ట్ కే చిత్రీకరణ జరుగుతుంది. ఫస్ట్ షెడ్యూల్ నందు బిగ్ బి అమితాబ్ పాల్గొన్నారు. దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే మూవీలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రాజెక్ట్ కే అనంతరం అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా చిత్రం షూటింగ్ సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రానికి స్పిరిట్ అనే టైటిల్ నిర్ణయించారు.