సారాంశం
`అదిపురుష్`పై అంచనాలు పెరుగుతున్నాయి. ఈ అంచనాలను మరింత పెంచేందుకు ఓ క్రేజీ ప్లాన్ రెడీ చేసింది యూనిట్. `ఆదిపురుష్ ` నుంచి మరో భారీ సర్‌ప్రైజ్ చేసింది.
`ఆదిపురుష్` సినిమాపై క్రమంగా బజ్ అమాంతం పెరుగుతుంది. టీజర్ సమయంలో అనేక విమర్శలు ఫేస్ చేసిన ఈ సినిమా ఇప్పుడు పాజిటివ్ బజ్, బిజినెస్, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లు, రిలీజ్ ప్లానింగ్ చూస్తుంటే అంచనాలకు ఆకాశమే హద్దుగా మారిపోతుంది. ఇప్పటికే `ఆదిపురుష్` ట్రైలర్‌తో టీజర్ కారణంగా వచ్చిన విమర్శలకు చెక్ పెట్టింది యూనిట్. ఎమోషన్స్ కి ప్రయారిటీ ఇచ్చారు. అంతేకాదు మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని తీసేసి రియాలిటీకి ప్రయారిటీ ఇచ్చారు. దీంతో ఆడియెన్స్ కనెక్ట్ అయ్యారు. దీనికితోడు సీత ఎమోషన్స్, రామాయణం(హిందుత్వం) సెంటిమెంట్ ఈ సినిమాకి కలిసొస్తున్నాయి.
ఈ అంచనాలను మరింత పెంచేందుకు ఓ క్రేజీ ప్లాన్ రెడీ చేసింది యూనిట్. `ఆదిపురుష్ ` నుంచి మరో భారీ సర్‌ప్రైజ్ చేసింది. సినిమా నుంచి మరో ట్రైలర్ ని విడుదల చేయబోతున్నారు. `ఆదిపురుష్` 2.0 పేరుతో మరో ట్రైలర్‌ని వదలబోతున్నారు. ఈ వార్త ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతుంది. అయితే మొదటి ట్రైలర్‌లో ఎమోషన్స్ ని చూపించారు. యుద్ధానికి సన్నద్దం కావడాన్ని చూపించారు. ఈ సారి యాక్షన్ డోస్ పెంచుతున్నారు. కాదు, పూర్తిగా యాక్షన్ ట్రైలర్‌ని విడుదల చేయబోతున్నారు.
పూర్తి స్థాయిలో యుద్ధ అంశాల నేపథ్యంలో ఈ ట్రైలర్ ని కట్ చేశారు. రేపు(జూన్ 6న) తిరుపతి ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ ట్రైలర్ ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇది ప్రభాస్ ఫ్యాన్స్ కి బిగ్ సర్‌ప్రైజ్‌గా ఉండబోతుండటం విశేషం. అయితే మొదటి ట్రైలర్ ని నెల రోజుల ముందే రిలీజ్ చేసినప్పుడే మరో ట్రైలర్ ఉంటుందని భావించారు. దీన్ని ఇంత కాలం సీక్రెట్‌గా దాచిన యూనిట్ ఎట్టకేలకు కన్ఫమ్ చేసింది. ఈవెంట్ లో అది ప్రభాస్ అభిమానులకు ట్రీట్‌గా ఉండేలా ప్లాన్ చేసిందట. మరి ఇది ఎలా ఉండబోతుందో చూడాలి.
ఇక ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా నటిస్తున్న చిత్రం `ఆదిపురుష్`. రామాయణం ఆధారంగా దర్శకుడు ఓం రౌత్ ఈ సినిమాని రూపొందించారు. టీ సిరీస్ నిర్మించింది. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగానూ దూకుడు పెరిగింది. ఈ సినిమా సౌత్‌లో రూ.185కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. నార్త్ లో తాజాగా ముప్పై కోట్ల బిజినెస్‌చేసింది. ఇది మున్ముందు మరింతగా పెరిగే అవకాశం ఉంది. డిజిటల్ రైట్స్ కూడా షాకింగ్ రేట్‌కి అమ్ముడు పోయాయట.