దర్శకుడు రవిబాబు కొత్తదనం సినిమాలు చేస్తూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. ఒకప్పుడు హిట్లు అందుకున్న ఈ డైరెక్టర్ కి ఈ మధ్య కాలంలో ఒక్క హిట్టు కూడా పడలేదు. వరుసగా ఫ్లాప్స్ రావడంతో కొంతకాలం డైరెక్షన్ కి బ్రేక్ ఇచ్చాడు.

ఎంతో నమ్మకంతో పంది పిల్లని ప్రధాన పాత్రలో పెట్టి సినిమా తీశాడు. అదే 'అదుగో' సినిమా. చాలా రోజుల పాటు షూటింగ్ జరిపిన ఈ సినిమా వీఎఫ్ఎక్స్ కోసం కూడా బాగానే ఖర్చుపెట్టారట. ఈ సినిమాపై ఉన్న నమ్మకంతో తన ఆస్తులన్నీ పెట్టుబడిగా పెట్టారట రవిబాబు.

సురేష్ బాబు బ్యాకప్ ఉన్నా.. ఆయన సినిమాపై పెట్టుబడి పెట్టలేదని కేవలం రిలీజ్ విషయంలో మాత్రమే సహాయం చేశాడని సమాచారం. ఈ సినిమాపై నమ్మకంలేకే సురేష్ బాబు డబ్బు  కూడా పెట్టాలేదట. పబ్లిసిటీకి కూడా డబ్బులు ఖర్చు పెట్టొద్దని రవిబాబుకి సలహా ఇచ్చారట.

కానీ రవిబాబు మాత్రం డబ్బు బాగానే ఖర్చు పెట్టాడు. గత వారం విడుదలైన సినిమాకి ఓపెనింగ్స్ కూడా రాలేదు. కనీసం పోస్టర్ల కోసం పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాకపోవడంతో ఈ సినిమాను నమ్ముకొని రవిబాబు దివాలా తీశాడని ఫిలిం నగర్ వర్గాల సమాచారం.